క్రీడాభూమి

జోరు కొనసాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాజయంతో మెగా టోర్నీని మొదలుపెట్టిన పాకిస్తాన్, ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి జోరుమీదుంది. అదే జోరును శ్రీలంకతో మ్యాచ్‌కు కొనసాగిద్దామనుకున్న సర్ఫరాజ్ సేనకు వర్షం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే పోరులో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాకుండా ప్రపంచకప్‌కు ముందు
కంగారూల చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాక్ బదులు తీర్చుకునేందుకు సిద్ధమైంది.
*
టౌన్టన్, జూన్ 11: సరిగ్గా ప్రపంచకప్‌కు రెండు నెలల ముందు దుబాయ వేదికగా ఇరు జట్లు ఐదు మ్యాచుల వనే్డ సిరీస్‌ను ఆడాయ. అప్పటికే భారత్‌పై సిరీస్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తోనూ ఐదు మ్యాచుల వనే్డ సిరీస్ ఆడిన పాక్ నాలుగింట్లో ఘోర పరాజయం పాలవ్వగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా పోయంది.
11 నెలల తర్వాత గెలుపు..
కొన్నాళ్లుగా గెలుపు రుచి చూడని పాకిస్తాన్ మెగా టోర్నీకి సిద్ధమైంది. ఇక్కడా ఆడిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై పేలవమైన ఆటతీరు కనబర్చి 105 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లలో ఫఖర్ జమాన్ (22), బాబర్ ఆజమ్ (22) మాత్రమే ఫర్వాలేదనించగా, మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. 2019 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇక రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 8 వికెట్లు కోల్పోయ 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందుంచింది. ఈసారి సీనియర్ బ్యాట్స్‌మన్ మహమ్మద్ హఫీజ్, బాబర్ ఆజమ్, కెప్టెన్ సర్ఫరాజ్ అహమ్మద్‌లు అర్ధ సెంచరీలు చేశారు. అయతే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లీష్ జట్టు 14 పరుగుల తేడాతో టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో 11 నెలల తర్వాత వనే్డల్లో పాకిస్తాన్ గెలుపు రుచి చూసింది.
శ్రీలంకతో మ్యాచ్ వర్షార్పణం..
గెలుపుతో జోరుమీదున్న పాకిస్తాన్ అదే ఉత్సాహంతో శ్రీలంక జట్టుతో తలపడేందుకు సిద్ధమవ్వగా పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. టాస్ వేయకుండానే పదేపదే వర్షం అడ్డుపడడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాక్ ఖాతాలో 1 పాయంట్ చేరింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచులాడిన పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలుపొందగా, మరో మ్యాచ్‌లో ఓడిపోయంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ రద్దయంది.
ఆసీస్‌కు మిడిలార్డర్ సమస్య..
బాల్ ట్యాంపరింగ్ వివాదం, ఆటగాళ్ల ఫాం లేమీతో కొన్నాళ్లుగా వరుస ఓటములతో సతమత మైన ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్‌కు ముందు భారత్, పాకిస్తాన్‌పై వనే్డ సిరీస్‌లను నెగ్గి మెగా టోర్నీలో అడుగు పెట్టింది. అయతే పసికూన అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 207 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కంగారూలు 35 ఓవర్లు ఆడి గెలిచారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ఆరంభ మ్యాచ్‌లోనే తడబాటుకు గురైందని సొంత ప్రేక్షకుల నుంచి కొంత విమర్శలొచ్చాయ. ఇక వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడినంత పనైంది. ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 288 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో విండీస్ 9 వికెట్లు కోల్పోయ 273 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓడిపోయంది. రెండు విజయాలతో జోష్ మీదున్న కంగారూలు టీమిండియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో చిత్తయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లు కోల్పోయ ఆసీస్ ముందు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉ ంచింది. ఆ తర్వాత గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు భారత బౌలర్ల ధాటికి లొంగిపోవడంతో 316 పరుగులకే ఆలౌటై 36 పరుగుల తేడాతో మెగా టోర్నీలో మొదటి ఓటమిని చవిచూశారు.
బౌలర్ల పరుగులే పరుగులు..
ఆస్ట్రేలియా జట్టులో బౌలర్లకు కొదువే లేదు. ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌ల్లో వికెట్లు తీస్తున్న బౌలర్లు పరుగులు మాత్రం ధారాళంగా సమర్పించుకుంటున్నారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నైల్ వంటి బౌలర్లు 10 ఓవర్లు వేసి 60కి పరుగులు సమర్పించుకున్నారు. ఇక మార్కస్ స్టొయనిస్ అయతే 7 ఓవర్లలోనే 62 పరుగులివ్వడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
వారిద్దరిపైనే ఆశలు..
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది పాటు నిషేధానికి గురై తిరిగి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌లపైనే ఆసీస్ ఆశలు పెట్టుకుంది. వార్నర్, స్మిత్‌లు మూడు మ్యాచ్‌ల్లో రెండేసి అర్ధ సెంచరీలను సాధించి, జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్ల కంటే ముందు వరుసలో ఉన్నారు. ప్రపంచకప్‌కు ముందు ఫాంలోకి వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ పసికూన అఫ్గాన్‌పై అర్ధ సెంచరీ సాధించినా, మిగతా రెండు జట్లపై తక్కువ స్కోరుకే అవుటై వెనుదిరిగాడు. ఇక జట్టును మిడిలార్డర్ సమస్య కూడా వేధిస్తోంది. అదృష్టమేమిటంటే విండీస్ మ్యాచ్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్, భారత్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీలు అర్ధ సెంచరీలు సాధించారు.
ప్రపంచకప్‌లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు మొత్తం 9 సార్లు తలపడగా, ఆసీస్ 5, పాక్ జట్టు నాలుగు మ్యాచుల్లో నెగ్గాయ.
ఈ మ్యాచ్ పాక్ జట్టుకు కీలకం కానుంది. దీని తర్వాత దాయాది దేశమైన భారత్‌తో తలపడాల్సి ఉండడంతో పాకిస్తాన్‌కు గెలుపు అవసరం తప్పనిసరి కానుంది.
చిత్రం... ఆడం జంపా నెట్ ప్రాక్టీస్