క్రీడాభూమి

ఆత్మవిశ్వాసమే మా బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆట అంచున
నే-నున్నపుడు
శిఖర శిగలైనా -
సముద్ర సెగలైనా
నాకు మైదానాలే.
లక్ష్యపు తొవ్వల్లో - చూపు
నిలిపినపుడు
మండే గోళమైనా -
మంచు పాతమైనా
నా శ్వాసలే.
వెన్ను - ముందున్నోడిని
వెచ్చటి రక్తానికి వెనకడుగు తెలీదు
మన్ను - మీదున్నోడిని
కన్ను పొడుచుకున్నా చూపు ఆగదు
రక్తమోడిన గాయం
రాత్రికి తగ్గిపోతుంది
రెచ్చిపోయన విజయం
రుతువులున్నంత కాలం ఉంటుంది.
నేను ధావన శిఖరాన్ని కాదు
భారత ఘన విజయానికి
అణువంత ఆనవాలుని!!
*
ఎడమచేతి బొటనవేలుకు గాయమై, ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడినప్పటికీ భారత్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఆత్మవిశ్వాసం కించిత్తు అయినా తగ్గలేదు. ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందోరీ రాసిన కవితను ట్వీట్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసమే తమ బలమని తేల్చిచెప్పాడు.
*
నాటింహామ్, జూన్ 12: ఎడమచేతి బొటనవేలుకు గాయమై, ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడినప్పటికీ భారత్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఆత్మవిశ్వాసం కించిత్తు అయినా తగ్గలేదు. ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందోరీ రాసిన కవితను ట్వీట్ చేయడం ద్వారా ఆత్మవిశ్వాసమే తమ బలమని తేల్చిచెప్పాడు. హెయిర్‌లైన్ ఫ్యాక్చర్ కారణంగా ధావన్ కనీసం మూడు మ్యాచ్‌లకు దూరం అవుతున్నాడు. గురువారంనాడు న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్తాన్‌తో, 22న అఫ్గనిస్తాన్‌తో టీమిండియా తలపడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్ ఈ మూడు గ్రూప్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అయితే, ఇలాంటి చిన్నచిన్న అడ్డంకులు ఎన్ని వచ్చినా వరల్డ్ కప్‌లో తమ ప్రస్థానం ఆగబోదని రాహత్ ఇందోరీ కవిత ద్వారా ధావన్ చెప్పకనే చెప్పాడు.
*
‘కభీ మెహక్ కీ తరహ్ హమ్ గులోంసే ఉడ్‌తే హై
కభీ ధుయేకీ తరహ్ హమ్ పర్వతోంసే ఉడ్‌తే హై
యే కైంచియా హమే ఉడ్‌నే సే ఖాక్ రోకేంగే?
కే హం పరోసే నహీ.. హౌస్‌లోసే ఉడ్‌తే హై!!
- రాహత్ ఇందోరీ
‘ఒక్కోసారి మేము పరిమళంలా పూతోటల నుంచి ఎగురుతాం.. ఒక్కోసారి పొగమంచులా మేము పర్వతాల పైనుంచి వెళ్తాం.. ఈ కత్తెరలు మమ్మల్ని ఎగరనీయకుండా ఏమి ఆపగలవు?.. ఎందుకంటే మేము రెక్కలతో కాదు..ఆత్మవిశ్వాసంతో ఎగురుతాం..’