క్రీడాభూమి

ఇంగ్లాండ్‌కు రిషభ్ పంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 12: టీమిండియా యువ ఆటగాడు, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో ఇంగ్లాండ్‌కు వెళ్లాలని ఆదేశించింది. ప్రపంచకప్‌నకు ఎంపికైన 15మందిలో పంత్‌పేరు లేకపోవడంతో తీవ్ర చర్చ జరిగిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు అతడు జట్టుతో కలవనున్నాడు. పంత్ రావడంతో ధావన్ జట్టు నుంచి వైదొలిగినట్లు కాదని, ప్రస్తుతం జట్టుకి అందుబాటులో ఉండాలని మాత్రమే పంత్‌కు సూచించారు. జట్టు మేనేజ్ మెంట్ అభ్యర్థన మేరకు రిషభ్‌పంత్ భారత్‌నుంచి ఇంగ్లాండ్‌కు వస్తున్నాడని, ఇంగ్లాండ్‌లోని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే ముందు భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, సౌరవ్ గంగూలీతో పాటు ఆ స్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పంత్ పేరును బీసీసీఐకి సూచించిన విషయం తెలిసిందే. ధావన్‌ను ఇంగ్లాండ్‌లోనే ఉంచాలని కోరడంతో అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని ఆ అధికారి పేర్కొన్నాడు.