క్రీడాభూమి

మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ధావన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 12: భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయాన్ని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ బుధవారం తెలిపాడు. ఆస్ట్రేలి యాతో జరిగిన మ్యాచ్ గాయపడ్డ ధావన్‌ను బీసీసీఐ మెడికల్ టీమ్ ఇంగ్లాండ్‌లోనే ఉంచి చికత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగర్ మాట్లా డుతూ ధావన్ కోలుకోవడానికి 10 నుంచి 12 రోజుల సమయం పడుతుందన్నారు. మేం అతడికి అవసరమైన సాయాన్ని అందిస్తామని, అతడి స్థానంలో తుది జట్టుకు విజయ్ శంకర్‌ను ఎంపిక చేస్తామని చెప్పాడు. ఇంకో ఆటగాడిని అందుబాటులో ఉంచుకోవడం మంచిదని ఉద్దేశ్యంతో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను ఇంగ్లాండ్ కు రప్పిస్తున్నట్లు వివరించాడు. మరోవైపు బీసీసీఐ ఇప్పటివరకు ధావన్ స్థానంలో ఎంపిక చేయలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొ కరిని తీసుకుంటే ఆ తర్వాత ఆ ఆటగాడు కోలుకున్నా తిరిగి జట్టులోకి రావడానికి వీలుండదు. జూన్ 30లోపు ధావన్ కోలుకుంటాడని బీసీసీఐ మెడికల్ భావిస్తుం డగా, కోలుకోని పక్షంలో రిషభ్‌పంత్‌ను అతడి స్థానంలో ఎంపిక చేసే అవకాశముంది.