క్రీడాభూమి

పాక్‌పై ఆసీస్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూన్ 12: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లు మొదటినుంచే ధాటిగా ఆడారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మరోవైపు సెంచరీకి చెరువైన ఫించ్ (82) అమీర్ బౌలింగ్‌లో హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ (10), గ్లేన్ మ్యాక్స్‌వెల్ (20) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో ఆస్ట్రేలియా 3వికెట్లు కోల్పోయ 223 పరుగులు చేసింది. ఈ క్రమంలో సెంచరీ సాధించిన వార్నర్ (107)ను షాహీన్ ఆఫ్రిదీ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (18), షాన్ మార్ష్ (23), నాథన్ కౌల్టర్ నైల్ (2), ప్యాట్ కమ్మిన్స్ (2), అలెక్స్ క్యారీ (20), మిచెల్ స్టార్క్ (3), కేన్ రిచర్డ్స్‌సన్ (1, నాటౌట్) పెవిలియన్‌కు చేరడంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.
అమీర్ సూపర్ స్పెల్..
పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. మొత్తం 10 ఓవర్లు వేసిన అమీర్ 2 మెయడిన్ ఓవర్లు వేశాడు. అమీర్‌కు జతగా షాహీన్ ఆఫ్రిదీ 2 వికెట్లు, హసన్ అలీ, వాహబ్ రియాజ్, మహమ్మద్ హఫీజ్ తలో వికెట్ తీశారు.
ఆదిలోనే దెబ్బ..
308 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ను ప్యాట్ కమిన్స్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్ (0)ను పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్‌తో కలిసి ఇమామ్ ఉల్ హక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దశలో ఆజమ్ (30)ని కౌల్టర్‌నైల్ అవుట్ చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇమామ్ (53) కూడా అవుట్ కావడంతో పాక్ 136 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహమ్మద్ హఫీజ్ (46), సర్ఫరాజ్ అహమ్మద్ (40), చివర్లో హసన్ అలీ (32), వాహబ్ రియాజ్ (45) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఓటమి తప్పలేదు. చివరి వికెట్‌గా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రనౌట్ కావడంతో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్‌కు 3 వికెట్లు పడగా, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. నాథన్ కౌల్టర్ నైల్, ఆరోన్ ఫించ్ కూడా తలో వికెట్ దక్కించుకున్నారు.

స్కోర్ బోర్డు:
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ ఫించ్ (సీ) హఫీజ్ (బీ) అమీర్ 82, డేవిడ్ వార్నర్ (సీ) ఇమామ్ ఉల్ హక్ (బీ) షాహీన్ అఫ్రిదీ 107, స్టీవెన్ స్మిత్ (సీ) అసీఫ్ అలీ (బీ) హఫీజ్ 10, గ్లేన్ మ్యాక్స్‌వెల్ (బీ) షాహీన్ అఫ్రిదీ 20, షాన్ మార్ష్ (సీ) షోయాబ్ మాలిక్ (బీ) అమీర్ 23, ఉస్మాన్ ఖాజా (సీ) రియాజ్ (బీ) అమీర్ 20, నాథన్ కౌల్టర్ నైల్ (సీ) సర్ఫరాజ్ (బీ) రియాజ్ 2, ప్యాట్ కమిన్స్ (సీ) సర్ఫరాజ్ (బీ) హసన్ అలీ 2, మిచెల్ స్టార్క్ (సీ) షోయాబ్ మాలిక్ (బీ) అమీర్ 3, కేన్ రిచర్డ్‌సన్ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 19 మొత్తం: 307 (49ఓవర్లలో)
వికెట్ల పతనం: 1-146, 2-189, 3-223, 4-242, 5-277, 6-288, 7-299, 8-302, 9-304, 10-307.
బౌలింగ్: మహమ్మద్ అమీర్ 10-2-30-5, షాహీన్ అఫ్రిదీ 10-0-70-2, హసన్ అలీ 10-0-67-1, వాహబ్ రియాజ్ 8-0-44-1, మహమ్మద్ హఫీజ్ 7-0-60-1, షోయాబ్ మాలిక్ 4-0-26-0.
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఇమామ్ ఉల్ హక్ (సీ) అలెక్స్ క్యారీ (బీ) ప్యాట్ కమిన్స్ 53, ఫఖర్ జమాన్ (సీ) కేన్ రిచర్డ్‌సన్ (బీ) ప్యాట్ కమ్మిన్స్ 0, బాబర్ ఆజమ్ (సీ) కేన్ రిచర్డ్‌సన్ (బీ) కౌల్టర్ నైల్ 30, మహమ్మద్ హఫీజ్ (సీ) స్టార్క్ (బీ) ఫించ్ 46, సర్ఫరాజ్ అహ్మద్ (రనౌట్) మ్యాక్స్‌వెల్ 40, షోయాబ్ మాలిక్ (సీ) అలెక్స్ క్యారీ (బీ) ప్యాట్ కమ్మిన్స్ 0, అసీఫ్ అలీ (సీ) ఖాజా (బీ) కేన్ రిచర్డ్‌సన్ 32, వాహబ్ రియాజ్ (సీ) అలెక్స్ క్యారీ (బీ) స్టార్ క 45, మహమ్మద్ అమీర్ (బీ) స్టార్క్ 0, షాహీన్ అఫ్రిదీ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 14 మొత్తం: 266 (45.4ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-2, 2-56, 3-136, 4-146, 5-147, 6-160, 7-200, 8-264, 9-265, 10-266.
బౌలింగ్: ప్యాట్ కమ్మిన్స్ 10-0-33-3, మిచెల్ స్టార్క్ 9-1-43-2, కేన్ రిచర్డ్‌సన్ 8.4-0-62-2, నాథన్ కౌల్టర్ నైల్ 9-0-53-1, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 7-0-58-0, ఆరోన్ ఫించ్ 2-0-13-1.

చిత్రం...డేవిడ్ వార్నర్
(107)