క్రీడాభూమి

హ్యాట్రిక్‌పై గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా టోర్నీలో సఫారీ, కంగారూ జట్లను మట్టికరిపించిన టీమిండియా నేడు కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. రెండు అగ్రశ్రేణి జట్లపై విజయం నమోదు చేసిన భారత జట్టు గురువారం న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ సాధించే దిశగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించిన విలియమ్సన్ సేన గత ప్రపంచకప్ ఫైనల్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి కప్పు కొట్టాల్సిందేనన్న కసితో కనిపిస్తోంది.
*
నాటింహామ్, జూన్ 12: ఈసారి ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో విరాట్ సేన మంచి శుభారంభం చేసింది. ఆడిన రెండు మ్యా చుల్లోనూ విజయం సాధించి, నేడు న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి, పాయంట్ల పట్టికలో ముందు వరుసలో నిలిచింది. దీం తో ఇరు జట్ల మధ్య పోరు ఎలా ఉండబోతున్నదనేది ఆసక్తిగా మారింది.
వామాప్‌లో ఓటమి..
ఈసారి ప్రపంచకప్‌లో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన కోహ్లీ సేన తన వామాప్ మ్యాచ్‌లో న్యూజి లాండ్‌తో తలపడగా ఓటమి చవిచూసింది. టాస్ గెలి చి బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టులో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో 179 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించింది.
కప్పు కొట్టాలనే కసితో..
గత ప్రపంచకప్‌లోనే ప్రపంచకప్ కప్పు కొట్టాల్సిన కివీస్ త్రుటిలో చేజార్చుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టింది. మొదట రెండు వామాప్ మ్యాచుల్లో భారత్‌పై గెలిచినా, వెస్టిండీస్‌పై ఓటమి ఎదురైంది. అప్పటికే తేరుకున్న కివీస్ ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో 10 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో, అఫ్గానిస్తాన్‌తో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మెగాటోర్నీలో దూసుకుపోతోంది.
అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్..
న్యూజిలాండ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ అసాధారణమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ మంచి ఫాంలో ఉండడం కీవిస్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో రాస్ టేలర్ రెండు అర్ధ సెంచరీలు, కెప్టెన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రోలు తలో అర్ధ సెంచరీ సాధించారు. ఇక బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ 5 వికెట్లు తీసుకోగా, మ్యాట్ హెన్రీ 7, లాకీ ఫెర్గూసన్ 4, జేమ్స్ నీషమ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నారు.
విరాట్, రోహిత్‌పైనే ఆశ లు..
గురువారం జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా విరాట్, రోహిత్‌లపై ఆశలు పెట్టుకుంది. గత రెండు మ్యాచుల్లో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్ అదే ఫామ్‌ను కనబరిస్తే జట్టుకు తిరుగుండదు. మరోవైపు విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కూడా జట్టుకు అదనపు బలం చేకూరనుంది. ఇక కేఎల్ రాహుల్, మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యాలు తమ పరిధిమేర రాణిస్తే కివిస్‌ను ఓడించడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌తో పాటు యుజు వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో గత మ్యాచుల్లో విజయం సాధించారు. అయతే న్యూజిలాండ్‌పై అదే జోరును కొనసాగిస్తారా? లేదా? చూడాలి.
ధావన్ లేని లోటు..
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ హీరో శిఖర్ ధావన్ గాయపడడం భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ. మంచి ఫాంలో ఉన్న ధావన్ ఎడమ చేతి వేలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ కారణంగానే ఫీల్డింగ్ కూడా చేయలేదు. అయతే శిఖర్‌ను పరీక్షించిన వైద్యులు కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరం చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో జరిగే మ్యాచ్‌లకు గబ్బర్ అందుబాటులో ఉండనట్లే.
పొంచి ఉన్న వర్షం ముప్పు..
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగే భారత్, న్యూజి లాండ్ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశం ఉన్నట్లు అ క్కడి వాతావరణ శాఖ పేర్కొంది. గరువారం మధ్యా హ్నం నుంచే భారీ వర్షంతో పాటు వరదలతో రవా ణా వ్యవస్థకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రపంచకప్‌లో మూడు మ్యాచు లు వర్షం కారణంగా రద్దయన విషయం తెలిసిందే.
గత చరిత్ర..
ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు మొత్తం 7 సార్లు తలపడగా, ఇందులో టీమిండియా మూడు సార్లు, కివీస్ నాలుగు సార్లు విజయం సాధించాయ. మొదటిసారిగా 1987 జరిగిన మెగా టోర్నీలో భారత్ రెండుసార్లు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఆ తర్వాత 2003 ప్రపంచకప్‌లోనూ అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. మొదటి ఓవర్ వేసిన జహీర్ ఖాన్ రెండు వరుస బంతుల్లో క్రెయగ్ మెక్ మిలన్, నాథన్ అస్టల్ వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడు. మ్యాచ్ మొత్తంలో జహీర్ 4, హర్భజన్ సింగ్ 2 వికెట్లతో రాణించడంతో కివీస్ 146 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. మహమ్మద్ కైఫ్, రాహుల్ ద్రావిడ్‌లు అర్ధ సెంచరీలు సాధించారు. ఇక న్యూజిలాండ్ 1975, 1979, 1992, 1999 ప్రపంచకప్‌లలో నాలుగు సార్లు భారత్‌పై విజయం నమోదు చేసింది.

చిత్రాలు.. *టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
*నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్