క్రీడాభూమి

మ్యాచ్ కి వర్షం బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 13: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను వర్షం బెడద వెంటాడుతునే ఉంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. టాస్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నప్పుడే వర్షం మొదలైంది. ఔట్ పీల్డ్‌పై నీరు నిలవకుండా గ్రౌండ్స్‌మెన్ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సూపర్ సోకర్స్‌తో ఎప్పటికప్పుడు మైదానంపై తడి లేకుండా చూసేందుకు కృషి చేవారు. అయితే, గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, మైదానంపై తడి పూర్తిగా ఆరలేదు. రోజు మొత్తం మీద జల్లులు కురుస్తునే ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ, మరోవైపు అభిమానులు కేరింతలు కొడుతూ, ఆట ప్రారంభమవుతుందన్న ఆశతో ఎదురుచూశారు. జల్లులు తగ్గినట్టు కనిపించగానే అంపైర్లు పిచ్‌ని పరిశీలించడం, అదే సమయంలో వర్షం మళ్లీ మొదలుకావడంతో వారు వెనక్కు మళ్లడం పలుమార్లు చోటు చేసుకుంది. చివరి క్షణం వరకూ ఆటను కొనసాగించడానికి అంపైర్లు ప్రయత్నాలు చేసినప్పటికీ, భారీ జల్లులతో ఔట్ ఫీల్డ్ కూడా బురదమయం కావడంతో మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయింది.
రెండు అజేయ జట్ల మధ్య పోరు సహజంగానే అందరినీ ఆకట్టుకుంది. ఇరు జట్ల అభిమానులతో స్టాండ్స్ కిక్కిరిసిపోయాయి. వర్షం తగ్గిన ప్రతిసారీ ఆట మొదలవుతుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన వారందరికీ నిరాశే మిగిలింది. హోరాహోరీ పోరును ఊహించిన అభిమానులు మ్యాచ్ రద్దుకావడంతో దిగాలుపడి వెనుదిరిగారు.