క్రీడాభూమి

అమెరికా డిస్టెన్స్ రన్నర్ గ్రునెవాల్డ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, జూన్ 13: కొంత కాలంగా కేన్సన్ వ్యాధితో బాధపడుతున్న అమెరికా డిస్టెన్స్ రన్నర్ గాబ్రియేల్ గ్రునెవాల్డ్ మృతి చెందింది. 32 ఏళ్ల గ్రునెవాల్డ్ సుమారు పది సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకుంది. వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. రెండుమూడు రోజులుగా పరిస్థితి విషమించిందని, ఎంత ప్రయత్నించినా గ్రునెవాల్డ్‌ను దక్కించుకోలేకపోయానని ఆమె భర్త జస్టిన్ ట్వీట్ చేశాడు. తనకు భార్య, స్నేహితురాలు, మార్గదర్శి.. అన్నీ ఆమేనని వ్యాఖ్యానించాడు. ఆమె స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. కాగా, 2009లో మొదటిసారి గ్రునెవాల్డ్‌కు నోటి కేన్సన్ సోకినట్టు గుర్తించారు. శస్త్ర చికిత్సలు, వైద్య సేవల మధ్యే ఆమె పట్టుదలతో కెరీర్‌ను కొనసాగించింది. 2012 ఒలింపిక్స్ ట్రయల్స్‌లో, 1,500 మీటర్ల పరుగులో పాల్గొన్న ఆమె నాలుగో స్థానంలో నిలవడంతో అర్హతను కోల్పోయింది. అయితే, 2014 యూఎస్ ఇండోర్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 3,000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని, సత్తా చాటింది. 2016లో జరిగిన ఒలింపిక్ ట్రయల్స్‌లో మరోసారి 1,500 మీటర్ల పరుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే, శరీరం సహకరించకపోవడంతో, 12వ స్థానానికి పరిమితమైంది. ఆతర్వాత కొన్ని రోజులకే ఆమెకు శస్త్ర చికిత్స జరిగింది. కాలేయంలో ఏర్పడిన పెద్ద కంతిని వైద్యులు తొలగించారు. ఆతర్వాత కూడా ఆమె కెరీర్‌ను కొనసాగించే ప్రయత్నం చేసింది. కానీ, ఎక్కువ సందర్భాల్లో అనుకున్న విధంగా రాణించలేకపోయింది. వ్యాధి ముదరడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
*
గాబ్రియేల్ గ్రునెవాల్డ్ (ఫైల్)