క్రీడాభూమి

కెరీర్‌కు చాంగ్ వెయ్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రజయ (మలేసియా), జూన్ 13: మలేసియా బాడ్మింటన్ సూపర్ స్టార్ లీ చాంగ్ వెయ్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న 36 ఏళ్ల గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అత్యంత ప్రతిభావంతులైన బాడ్మింటన్ క్రీడాకారుల జాబితాలో చోటు సంపాదించిన చాంగ్ వెయ్‌కి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోగానీ, ఒలింపిక్స్‌లోగానీ ఒక్క పతకం కూడా సాధించలేకపోయానన్న అసంతృప్తి ఉంది. గత ఏడాది ఆరంభంలో కేన్సన్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో బయటపడింది. తైవాన్‌లో చికిత్స పొందిన అతను మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అయితే, కెరీర్‌ను మళ్లీ మొదలుపెట్టడానికి పలుమార్లు డెడ్‌లైన్లను తనకు తానే విధించుకొని, మళ్లీ వాటిని వాయిదా వేస్తూ వచ్చాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అందుబాటులో ఉంటానని చాంగ్ వెయ్ ధీమాతో ఉన్నాడు. గతంలో మూడు పర్యాయాలు ఒలింపిక్స్‌లో రజత పతకాలతోనే సంతృప్తి చెందాల్సి వచ్చిన అతను టోక్యోలో స్వర్ణ సాధించాలన్నదే తన లక్ష్యమని పలు సందర్భాల్లో ప్రకటించాడు. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో, కెరీర్‌కు గుడ్‌బై చెప్పక తప్పలేదు. రిటైర్ కావడం బాధాకరమేగానీ, ఏదో ఒక రోజు అది తప్పదని చాంగ్ వెయ్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఎక్కువ సమయానికి తన భార్య, ఇద్దరు పిల్లలకు కేటాయిస్తానని అన్నాడు. 2012లో వివాహం చేసుకున్న తర్వాత ఇంత వరకూ తన భార్యను హానీమూన్‌ను తీసుకెళ్లలేదని, ఆ లోటును ఇప్పుడు భర్తీ చేస్తానని అన్నాడు. అయితే, బాడ్మింటన్ కోర్టును వీడడాన్ని జీర్ణించుకోలేకపోక పోతున్నా అంటూ బిగ్గరగా రోదించాడు.