క్రీడాభూమి

వాన్ గాల్‌కు చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, మే 19: ఏ క్రీడలోనైనా సహజంగా ఆటగాళ్లు పేరుప్రఖ్యాతులు ఆర్జిస్తారే తప్ప వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే కోచ్‌ల గురించి పట్టించుకోరు. ప్రత్యేకించి సాకర్ వంటి క్రీడలో కోచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నా, వారు ఎప్పటికీ తెరవెనుకే ఉండిపోతారు. కానీ, మాంచెస్టర్ యునైటెడ్ కోచ్ లూయిస్ వాన్ గాల్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఆటగాళ్లను మించిన క్రేజీని సంపాదించుకున్నాడు. మాంచెస్టర్ జట్టులోని ఆటగాళ్ల పేర్లు తెలియనివారు ఉంటారేమోగానీ, సాకర్‌పై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా వాన్ గాల్ పేరు తప్పకుండా తెలిసే ఉంటుంది. సాకర్ రంగంలోనే ఎక్కువ మంది అభిమానులున్న ఏకైక కోచ్ అతను. మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులైతే అతనిని నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. తనను ప్రాణప్రదంగా చూసుకునే వీరాభిమానుల నుంచే వాన్ గాల్‌కు చుక్కెదురు కావడం విచిత్రం. ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో చివరి మ్యాచ్ ఆడిన మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 3-1 తేడాతో బోర్న్‌వౌత్‌ను ఓడించింది. అయితే, ఈ విజయం అభిమానులకు ఊరటనివ్వలేదు. టైటిల్ రేసులో ఉంటుందని, కనీసం మొదటి మూడు స్థానాల్లో ఉంటుందని ఊహించుకున్న అభిమానులు మాంచెస్టర్ యునైటెడ్ ఐదో స్థానంతో సంతృప్తి చెందడంతో కంగుతిన్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు వాన్ గాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతను కనిపించిన ప్రతిసారీ హేళన చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వాన్ గాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రేక్షకులు పెద్దఎత్తున అల్లరి చేశారు. ఈ సంఘటనతో కంగుతిన్న అతను హడావుడిగా రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయాడు.