క్రీడాభూమి

ఉబేర్ కప్ బాడ్మింటన్ భారత్‌కు కనీసం కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కున్హాన్ (చైనా), మే 19: మహిళల టీం చాంపియన్‌షిప్ ఉబేర్ కప్‌లో భారత్ కనీసం కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో థాయిలాండ్‌ను 3-1 తేడాతో ఓడించిన భారత్ సెమీస్ చేరింది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్య పతకం లభిస్తుంది. భారత జట్టు ముందంజ వేస్తే, టైటిల్ సాధిస్తుంది లేదా రన్నర్ ట్రోఫీని అందుకుంటుంది. ఒకవేళ ఓడితే, కాంస్య పతకాన్ని అందుకుంటుంది. గురువారం నాటి తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత, హైదరాబాదీ సైనా నెహ్వాల్‌ను ప్రపంచ రెండో ర్యాంకర్ రచానొక్ ఇంతనాన్ 21-12, 21-19 తేడాతో ఓడించింది. దీనితో కంగుతిన్న భారత్‌కు తెలుగు తేజం పివి సింధు అండగా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న ఆమె 21-18, 21-7 స్కోరుతో బుసానన్ ఆన్‌బమ్‌రుగపన్‌పై గెలిచింది. దీనితో భారత్, థాయిలాండ్ చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచాయి. తొలి డబుల్స్‌లో జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ 21-19, 21-12 ఆధిక్యంతో పట్టీటా సుపజిరకుల్, సప్‌సిరీ తయెరటానాచయ్ జోడీపై గెలిచి, భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టింది. మూడో సింగిల్స్‌లో 19 ఏళ్ల రిత్విక శివానీ 21-18, 21-16 తేడాతో నిచావొన్ జిందాపొల్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసి, భారత్‌కు తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని అందించింది. దీనితో రెండో డబుల్స్ మ్యాచ్ అవసరం లేకపోయింది.

చిత్రం బుసానన్‌పై గెలిచి థాయలాండ్‌పై భారత్ విజయానికి బాటలు వేసిన పివి సింధు