క్రీడాభూమి

బంగ్లాదే పైచేయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టౌన్టన్, జూన్ 16: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సోమవారం వెస్టిండీస్‌తో జరిగే పోరులో బంగ్లాదేశ్‌దే పైచేయిగా విశే్లషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు జట్లు ఇంత వరకూ చెరి నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి. రెండేసి మ్యాచ్‌లను చేజార్చుకున్నాయి. చెరొక మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. మొత్తం మీద చెరి మూడు పాయింట్లతో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటికే నాటౌట్ దశకు చేరుకునే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగి, ప్రస్తుతం మొదటి నాలుగైదు స్థానాల్లో ఉన్న జట్లు వరుస పరాజయాలను ఎదుర్కొంటే తప్ప అటు బంగ్లాగానీ, ఇటు విండీస్‌గానీ నాకౌట్ దశకు చేరడం అసాధ్యం. ఇలావుంటే, వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఐర్లాండ్ వేదికగా జరిగిన ట్రై సిరసీలో విండీస్‌ను బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో ఓడించింది. ఇది సహజంగానే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది. అయితే, ఆ సిరీస్‌లో ఆడిన విండీస్ జట్టులో క్రిస్ గేల్, అండ్రె రసెల్ వంటి స్టార్లు లేరు. ఇప్పుడు వారి చేరికతో ఆ జట్టు బలాన్ని పుంజుకుంది. కానీ, బంగ్లా చేతిలో ఎదురైన మూడు వరుస పరాజయాల తర్వాత మళ్లీ ఆ జట్టును ఢీకొంటున్న జాసన్ హోల్డర్ నేతృత్వంలోని విండీస్ ఏ రీతిలో రాణిస్తుందనేది ఆసక్తి కలిగిస్తున్నది. ఈనెల 8న ఇంగ్లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్‌కు ఆతర్వాత శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీనితో ఆటగాళ్లకు సుమారు వారం రోజుల ఆటవిడుపు లభించింది. ఫామ్‌లోకి రావడానికి అల్లాడుతున్న శ్రీలంకను ఓడించి, రెండు పాయింట్లు సంపాదించే అవకాశం వర్షం వల్ల చేజారిందని బంగ్లా క్రికెటర్లు వాపోతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు దారుణంగా విఫలమైన కారణంగా ప్రత్యర్థి జట్టు 386 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపుగా అసాధ్యంగామారిన నేపథ్యంలో, బంగ్లా 280 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించే అంశంపై కెప్టెన్ మష్రాఫ్ మొర్తాజా, అతని సహచరులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది.
నిలకడలేని హోల్డర్ సేన
జాసన్ హోల్డర్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టులో నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తున్నది. ఆటగాళ్లు ఎప్పుడు విజృంభిస్తారో, ఎప్పుడు చేతులెత్తేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. జట్టులో ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ టీ-20 ఫార్మాట్ ప్రభావం నుంచి బయటపడలేదని వారు ఆడుతున్న విధానం స్పష్టం చేస్తున్నది. వనే్డ ఇంటర్నేషనల్ టోర్నీలో, ప్రత్యేకించి ప్రపంచ కప్ వంటి మెగా ఈవెంట్‌లో ఆచితూచి ఆడాల్సిన ఉండగా, విండీస్ బ్యాట్స్‌మెన్ అందుకు భిన్నంగా హడావుడి పడుతూ, వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ హోల్డర్ కూడా ప్రస్తావించాడు. ఆదివారం నెట్స్ అనంతరం అతను విలేఖరులతో మాట్లాడుతూ సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండేందుకు బ్యాట్స్‌మెన్ ప్రయత్నించాలని అన్నాడు. కొన్ని బలమైన భాగస్వామ్యాలు నమోదైతేగానీ ప్రత్యర్థులకు సవాళ్లను విసరలేమని స్పష్టం చేశాడు. గతం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని, సోమవారం జరగబోయే మ్యాచ్‌పై దృష్టి కేంద్రీకరించామని అన్నాడు. ఏదిఏమైనా, ఒకే రకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్, వెస్టిండీస్ మ్యాచ్ గెలిచినా నాకౌట్‌పై కొంతవరకైనా ఆశలు నిలబెట్టుకుంటే, ఓడిన జట్టు దాదాపుగా జట్టు నుంచి నిష్క్రమించినట్టే అవుతుంది.