క్రీడాభూమి

పాకిస్తాన్ చిత్తు చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్: ప్రపంచ కప్‌లో భారత్ ఆధిక్యానికి పాకి స్తాన్ మరోసారి తలవంచింది. వర్షం కారణంగా పలుమార్లు అం తరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో చివరికి డక్‌వర్త్ లూయస్ విధా నం ద్వారా పాక్ లక్ష్యాన్ని నిర్దారించారు. కానీ, లక్ష్యాన్ని అందుకో లేకపోయన పాక్ చిత్తుచిత్తుగా ఓడింది. 89 పరుగుల తేడాతో టీ మిండియా విజయభేరి మోగించింది. వరల్డ్ కప్‌లో పాక్‌పై భారత్ కు ఇది వరుసగా ఏడో విజయం. రోహిత్ శర్మ సెంచరీ, 11 వేల ప రుగుల క్లబ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరడం ఈ మ్యాచ్ హైలైట్స్.
మూడు పర్యాయాలు ఆట నిలిచిపోగా, భారత్ నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కాగా, డక్‌వర్త్ లూయస్ విధానంలో లక్ష్యాన్ని సవరించి, పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ధారించడంతో పాక్ ఓటమి ఖాయమైంది. అంద రూ ఊహించిన విధంగానే పాక్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 ప రుగులకు పరిమితమై, 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ విజృంభించి పరుగులు రాబడుతుంటే, అతనికి అండగా నిలిచేందుకు రాహుల్ నింపాదిగా ఆడాడు. మొదటి వికెట్‌కు 136 పరుగులు జత కలిసిన తర్వాత రాహుల్ వికెట్ కూలింది. వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ క్యాచ్ అందుకోగా ఔటైన రాహుల్ 78 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ, స్కోరు బోర్డును పరుగులు తీయించిన రోహిత్ కెరీర్‌లో 24వ వనే్డ సెంచరీని నమోదు చేశాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతను 140 పరుగులు చేసి, హసన్ అలీ బౌలింగ్‌లో వాహబ్ రియాజ్‌కు దొరికిపోయాడు. అతని స్కోరులో 14 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకోగా, వేగంగా పరుగులు సాధించే క్రమంలో హార్దిక్ పాండ్య వికెట్ పారేసుకున్నాడు. 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసిన అతను మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులను నిరాశ పరుస్తూ, కేవలం ఒక పరుగు చేసి, మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లోనే సర్ఫ్‌రాజ్ అహ్మద్‌కు చిక్కాడు. కోహ్లీ, విజయ్ శంకర్ క్రీజ్‌లో ఉండగా, భారత్ 46.4 ఓవర్లలో, నాలుగు వికెట్లకు 305 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం వెలిసిన తర్వాత ఆట మళ్లీ మొదలైంది. 65 బంతుల్లో, ఏడు ఫోర్లతో 77 పరుగులు చేసిన కోహ్లీ వికెట్‌ను, సర్ఫ్‌రాజ్ అహ్మద్ క్యాచ్ అందుకోగా మహమ్మద్ అమీర్ సాధించాడు. వనే్డల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల మైలురాయని చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ వికెట్ కూలడంతో పాక్ ఊరట చెందింది. అనంతరం విజయ్ శంకర్, కేదార్ జాదవ్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. అప్పటికి విజయ్ శంకర్ 15, కేదార్ జాదవ్ 9 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. పాక్ స్టార్ బౌలర్ మహమ్మద్ అమీర్ 10 ఓవర్లు బౌల్ చేసి, 47 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇలావుంటే, మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో, వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో భారత్ అత్యధిక స్కోరును నమోదు చేసింది. గతంలో శ్రీలంకపై ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 318 పరుగులు సాధించగా, ఇప్పుడు భారత్ ఐదు వికెట్లకు 336 పరుగులతో ఆ రికార్డును బద్దలు చేసింది.
ఆరంభంలోనే వికెట్..
ప్రపంచ కప్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఓటమి పరంపరకు చెక్ పెట్టేందుకు 337 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే, కేవలం 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ బౌల్ చేసిన భువనేశ్వర్ కుమార్ నాలుగు బంతుల తర్వాత కాలు బెణకడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ ఓవర్‌ను పూర్తి చేసే బాధ్యతను తీసుకున్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తన తొలి బంతిలోకే ఇమాముల్ హ్ (7)ను ఎల్‌బీగా పెవిలియన్‌కు పంపాడు. 13 పరుగుల వద్ద పాక్ మొదటి వికెట్ కోల్పోయింది. అరంతరం ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్ జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కూలకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజమ్ వరల్డ్ కప్‌లో తన తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. స్ట్రయక్ బౌలర్‌గా పేరు సంపాదించిన కుల్దీప్ యాదవ్‌గానీ, మరో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌గానీ పాక్ బ్యాట్స్‌మెన్‌పై ఆరంభంలో చెప్పుకోదగ్గ ప్రభావం ఏమీ చూపలేక పోయారు. ఫాస్ట్ బౌలర్ల పరిస్థితి కూడా అదే రీతిలో కొనసాగింది. 23వ ఓవర్ ముగిసే సమయానికి ఫకర్ జమాన్, బాబర్ ఆజమ్ భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అదే సమయంలో కో హ్లీ మైదానం విడిచి బయటకు వెళ్లడంతో, కెప్టెన్సీ బాధ్యతను కొద్ది సేపు రోహిత్ శర్మ తీసుకున్నాడు. రెండో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత బాబర్ ఆజమ్ ఔటయ్యా డు. 57 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసిన అతను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 117 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్‌ను కోల్పోయం ది. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహమ్మద్ హఫీజ్ తాను ఎదుర్కొన్న రెండో బంతినే సిక్స్‌గా కొట్టి, రన్‌రేట్‌ను పెంచాలన్న వ్యూహానికి తెరతీశాడు. కుల్దీప్ మరోసారి పాక్‌ను దెబ్బ తీశాడు. యుజువేంద్ర చాహల్‌కు క్యాచ్ ఇచ్చి, కుల్దీప్ బౌలింగ్‌లో ఔటైన ఫకర్ జమాన్ 75 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరు గులు చేశాడు. 126 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కో ల్పో యంది. ఆ ఓవర్ మెయడిన్ కావడం విశేషం. తర్వాతి ఓవర్‌లోనే పాక్ మరో వికెట్ చేజార్చుకుంది. హార్డ్ హిట్ట ర్ మహమ్మద్ హఫీజ్ (9)ను విజయ్ శంకర్ క్యాచ్ అందుకోగా, హార్దిక్ పాండ్య ఔట్ చేశాడు. తర్వాతి బంతికే అతను షోయబ్ మాలిక్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో పాతుకుపోయ, భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన సర్ఫ్‌రాజ్ అహ్మద్‌ను విజయ్ శంకర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా, వర్షం కారణంగా ఆట మరోసారి నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 35 ఓవర్లలో ఆరు వికెట్లకు 166 పరుగులు చేసింది. అప్పటికి ఇమాద్ వసీం 22, షాదాబ్ ఖాన్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంద నుకున్న మ్యాచ్ దాదాపుగా ఏకపక్షం కావడంతో అభిమానులు నీరసించారు. దీనికి తోడు వర్షం వెంటాడడం ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. అయతే, భారత అభిమానులు మాత్రం విజయం ఖాయమన్న ధై ర్యంతో, వర్షం ఎప్పుడు తగ్గుతుందా అన్న ఆశతో ఎదురుచూశారు. అప్పటికి విజయానికి పాక్ ఇంకా 171 పరుగు లు చేయాల్సి ఉండింది. 90 బంతులు మిగిలి ఉన్నాయ. 11.4 రన్ రేట్‌ను సాధించడం పాక్‌కు అసాధ్యమని స్పష్టమైంది. కాగా, రెండో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు 302 పరుగులు చేయాలని నిర్ధా రించారు. దీని ప్రకారం 30 బంతుల్లో 130 పరుగులు అవసరమైంది. అసాధ్యమైన ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయన పాక్ 40 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరు గులు చేయగలిగింది. భారత్ చేతిలో మరోసారి ఓటమిపాలైంది.

**
ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ చేరారు. 1992లో డెస్మండ్ హేన్స్, బ్రియాన్ లారా (వెస్టిండీస్) మొదటి వికెట్‌కు అజేయంగా 175 పరుగులు సాధించారు. ఈ స్కోరును పాక్‌పై వరల్డ్ కప్‌లో ఇంత వరకూ ఎవరూ నమోదు చేయలేదు. 1996లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రూడ్రీ స్మిత్, మైక్ ఆర్థర్టన్ మొదటి వికెట్‌కు 147 పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో టౌన్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ తొలి వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తాజాగా రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మొదటి వికెట్‌కు 136 పరుగులు జోడించడం ద్వారా ఈ జాబితాలో చేరారు. ఇలావుంటే, 1979లో డెస్మండ్ హేన్స్, గార్డెన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్) సాధించిన 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, 1983లో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గ్రాంట్ ఫ్లవర్, క్రిస్ తవారే 115 పరుగులు సాధించారు.

ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇంత వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు సంపాదించాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతను 140 పరుగులు చేశాడు. అతని స్కోరులో 14 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయ. కాగా, ఇంతకు ముందు, 2015లో అడెలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 107 పరుగులు చేశాడు. 2003లో సెంచూరియన్‌లో పాక్ బ్యాట్స్‌మన్ సయాద్ అన్వర్ 101 పరుగులు చేశాడు. అదే ఏడాది, అదే మైదానంలో సచిన్ తెండూల్కర్ 98 పరుగులకు ఔటై, కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఈఏడాది ఇంత వరకూ భారత్ 16 వనే్డలు ఆడితే, పాకిస్తాన్ 19 మ్యాచ్‌లు ఆడింది. భారత్ ఖాతాలో 15 విజయాలు ఉన్నాయ. 10 మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. కాగా, పాకిస్తాన్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది. గత కొంతకాలంగా టీమిండియా అద్భుత ఫలితాలను అందుకుంటుండగా, పాకిస్తాన్ నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశ పరుస్తున్నది. తాజా మ్యాచ్‌లో మరోసారి పరాజయాన్ని చవిచూసింది.
ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ఇంతవరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మొదటి వికెట్‌కు నమోదు చేసిన పరుగులు వరుసగా 25, 90, 37, 53, 48, 34, 136. పాక్‌పై వరల్డ్ కప్‌లో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని మొదటిసారి అందించిన ఘనతను రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ సొంతం చేసుకున్నారు.
షోయబ్ మాలిక్ వేసిన ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టి లోకేష్ రాహుల్ 68 బంతుల్లో తన అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అతని కెరీర్‌లో అతనికి ఇది మూడో హాఫ్ సెంచరీ. అతనికి ఇది 17వ వనే్డ ఇంటర్నేషనల్.
స్కోరుబోర్డు
భారత్: లోకేష్ రాహుల్ సీ బాబర్ ఆజమ్ బీ వాహబ్ రియాజ్ 57, రోహిత్ శర్మ సీ వాహబ్ రియాజ్ బీ హసన్ అలీ 140, విరాట్ కోహ్లీ సీ సర్ఫ్‌రాజ్ అహ్మద్ బీ మహమ్మద్ అమీర్ 77, హార్దిక్ పాండ్య సీ బాబర్ ఆజమ్, బీ మహమ్మద్ అమీర్ 26, మహేంద్ర సింగ్ ధోనీ సీ సర్ఫ్‌రాజ్ అహ్మద్ బీ మహమ్మద్ అమీర్ 1, విజయ్ శంకర్ 15 నాటౌట్, కేదార్ జాదవ్ 9 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 336.
వికెట్ల పతనం: 1-136, 2-234, 3-285, 4-298, 5-314.
బౌలింగ్: మహమ్మద్ అమీర్ 10-1-47-3, హసన్ అలీ 9-0-84-1, వాహబ్ రియాజ్ 10-0-71-1, ఇమాద్ వసీం 10-0-49-0, షాదాబ్ ఖాన్ 9-0-61-0, షోయబ్ మాలిక్ 1-0-11-0, మహమ్మద్ హఫీజ్ 1-0-11-0.
పాకిస్తాన్: ఇమాముల్ హక్ ఎల్‌బీ విజయ్ శంకర్ 7, ఫకర్ జమాన్ సీ యుజువేంద్ర చాహల్ బీ కుల్దీప్ యాదవ్ 62, బాబర్ ఆజమ్ బీ కుల్దీప్ యాద వ్ 48, మహబ్మద్ హఫీజ్ సీ విజయ్ శంకర్ బీ హార్దిక్ పాండ్య 9, సర్ఫ్‌రాజ్ అహ్మద్ బీ విజయ్ శంకర్ 12, షోయబ్ మాలిక్ బీ హార్దిక్ పాండ్య 0, ఇమాద్ వసీం 46 నాటౌట్, షాదాబ్ ఖాన్ 20 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (40 ఓవర్లలో 6 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1-13, 2-117, 3-126, 4-129, 5-129, 6-165.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 2.4-0-8-0, జస్‌ప్రీత్ బుమ్రా 8-0-52-0, విజయ్ శంకర్ 5.2-0-22-2, హార్దిక్ పాండ్య 8-0-44-2, కుల్దీప్ యాదవ్ 9-1-32-2, యుజువేంద్ర చాహల్ 7-0-53-0.

చిత్రాలు.. సెంచరీతో కదంతొక్కిన రోహిత్
*భారత్ అభిమానుల కోలాహలం..