క్రీడాభూమి

కోహ్లీ ఒక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడి పేరే మారుమోగుతోంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతను 50 బంతుల్లోనే, 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 113 పరుగులు చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఐపిఎల్ సీజన్‌లో అతనికి ఇది నాలుగో శతకం. ఈ టోర్నీ చరిత్రలోనే ఒక సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. అంతేగాక, 4,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్‌మన్‌గానూ అతను మరో రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ విజృంభణకు క్రిస్ గేల్ (32 బంతుల్లో 73) మెరుపు ఇన్నింగ్స్ కూడా తోడుకావడంతో, వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడి, చివరికి డక్‌వర్డ్ లూయిస్ విధానం ద్వారా ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్లకు 211 పరుగులు చేయగలిగింది. మొదట వర్షం కురిసినప్పుడు మ్యాచ్‌ని 15 ఓవర్లకు కుదించిన నిర్వాహకులు, రెండోసారి కొంత సేపు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో పంజాబ్ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 203 పరుగులుగా నిర్ణయించారు. కానీ, నిలకడగా అనుకున్న రన్‌రేట్‌ను సాధించడంలో విఫలమైన పంజాబ్ 14 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేయగలిగింది. 82 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు ప్లే ఆఫ్‌లో చేరే అవకాశాలను మెరుగుపరచుకుంది.
గాయంతోనే బరిలోకి..
చేతి గాయంతోనే కోహ్లీ బరిలోకి దిగాడు. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే పంజాబ్‌పై తప్పక గెలవాల్సిన నేపథ్యంలో అతను జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ని ఆడాలని నిర్ణయించాడు. నమమాత్రంగా ఆడకుండా, కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఐపిఎల్‌లోనేగాక, టి-20 ఫార్మెట్‌లోనే ఒక టోర్నీలో నాలుగు శతకాలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 113 పరుగులు చేసే క్రమంలో అతను ఈటోర్నీలో 4,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు. అంతేగాక, ఒక ఐపిఎల్‌లో 800 పరుగులను అధిగమించిన తొలి బ్యాట్స్‌మన్‌గానూ అతని ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మొత్తం 865 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా సురేష్ రైనా పేరుమీద ఉన్న రికార్డును అతను బద్దలు చేశాడు. టి-20 ఫార్మెట్‌లో ఆడుతూ ఒక టోర్నీలో అత్యధికంగా మూడు సెంచరీలు చేసి మైఖేల్ క్లింగర్ నెలకొల్పిన రికార్డు కూడా కోహ్లీ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. క్లింగర్ 2015లో జరిగిన నాట్‌వెస్ట్ బ్లాస్ట్ టి-20 టోర్నీలో మూడు సెంచరీలు చేయగా, కోహ్లీ ఈసారి ఐపిఎల్‌లో నాలుగు శతకాలను నమోదు చేశాడు. అంతకు ముందు వరకూ టి-20 ఫార్మెట్‌లో 180 ఇన్నింగ్స్ ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన కోహ్లీ ఇప్పుడు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగు శతకాలు సాధించడం విశేషం. ఈ క్యాలెండర్ సంవత్సరంలో కోహ్లీ 11 పర్యాయాలు 75 లేదా అంతకుపైగా పరుగులు సాధించాడు. క్రిస్ గేల్ 2011లో ఒకసారి, 2015లో మరోసారి పదేసి సార్లు ఈ ఫీట్‌ను ప్రదర్శించగా, కోహ్లీ అతనిని రెండో స్థానానికి నెట్టేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టి-20 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఇప్పటి వరకూ 2,042 పరుగులు చేశాడు. ఈ ఫార్మెట్‌లో ఆడుతూ, ఒకే స్టేడియంలో రెండు వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా అతను మరో రికార్డు సృష్టించాడు. పంజాబ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో అతను 47 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌పై 56 బంతుల్లో, గుజరాత్ లయన్స్‌పైనే 53 బంతుల్లో సెంచరీలు చేసిన కోహ్లీకి ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ.
ప్రశంసల జల్లు
అసాధారణ స్థాయిలో రాణిస్తున్న విరాట్ కోహ్లీపై బెంగళూరు ఆటగాళ్లేకాదు.. ప్రత్యర్థి జట్ల క్రికెటర్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘లెజెండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ నెలకొల్పిన లెక్కలేనన్ని రికార్డులను తిరగరాసే సత్తా కోహ్లీకి మాత్రమే ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ జోస్యం చెప్పాడు. ఫిట్నెస్‌కు సచిన్ మారుపేరని, కోహ్లీ కూడా ఫిట్నెస్‌పై ఎంతో శ్రద్ధ తీసుకుంటాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కోహ్లీ లాంటి అసాధారణ ఆటగాడు ఎక్కడా ఉండడని కితాబునిచ్చాడు. చాలా మంది క్రికెటర్లు, అధికారులు, అభిమానులు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించగా, అతను చాలా తొందరలోనే సచిన్ రికార్డును అధిగమిస్తాడని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఫామ్ అసాధారణమని సౌరవ్ గంగూలీ ప్రశంసించాడు. మొత్తం మీద అందరూ కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సచిన్‌ను మరపించే సత్తా అతనికి ఉందంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇంతటి ప్రశంసలు అందుకునే సామర్థ్యం తనకు ఉందని కోహ్లీ తన అసాధారణ ఫామ్ ద్వారా రుజువు చేస్తున్నాడు.
***
ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతను 13 ఇన్నింగ్స్ ఆడి 865 పరుగులు సాధించాడు. ఎబి డివిలియర్స్ 13 మ్యాచ్‌ల్లో 597, కెప్టెన్ డేవిడ్ వార్నర్ 12 మ్యాచ్‌లు ఆడి 567 పరుగులు చేసి ఈ జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఐపిఎల్ టోర్నీలోనే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలోనూ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. కానీ, ఆ ఆనందం ఒక రోజు కూడా నిలవలేదు. 136 ఇన్నింగ్స్‌లో అతను 4,002 పరుగులు చేశాడు. సురేష్ రైనా గురువారం తన 144 ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం చేసి, కోహ్లీ పరుగులను అధిగమించాడు. అతని ఖాతాలో ఇప్పుడు 4,038 పరుగులున్నాయ. కాగా, రోహిత్ శర్మ 141 ఇన్నింగ్స్‌లో 3,844 చొప్పున పరుగులు చేసి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 4, 4 స్థానాలను కూడా భారతీయులే ఆక్రమించడం విశేషం. గౌతం గంభీర్ 129 ఇన్నింగ్స్‌లో 3,582, రాబిన్ ఉతప్ప 132 ఇన్నింగ్స్‌లో 3,329 చొప్పున పరుగులు చేసి, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.