క్రీడాభూమి

ఆతిథ్య జట్టుకు గాయాల సమస్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 17: ఈసారి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తూ, ఇంత వర కూ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూ డింటిని గెల్చుకొని, టైటిల్ ఫేవరిట్స్ జాబితాలో చేరిన ఇంగ్లాండ్ జట్టును గాయాల సమస్య వెంటాడుతున్నది. శుక్రవా రం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కండరాల నొప్పికారణంగా మైదానాన్ని విడిచి వెళ్లగా, ఓపెనర్ జాస న్ రాయ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోయినా, జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగిన మోర్గాన్, కాలి కండరాల నొప్పి తీవ్రం కావడంతో, వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 41వ ఓవర్‌లో గ్రౌండ్‌ను వదలి వె ళ్లాల్సి వచ్చింది. అతనికి వైద్య సేవలు అందిస్తున్నా రు. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగే మ్యాచ్‌లో మోర్గాన్ ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది.
రెండు మ్యాచ్‌లకు రాయ్ దూరం
రాయ్ కూడా ఫిట్నెస్ సమస్యతో అల్లాడుతున్నాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతనికి కనీసం వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నట్టు సమాచారం. కాగా, ఎడమకాలి కండరాలు చిట్లడంతో బాధపడుతున్న అతను కనీసం రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. దీనితో అతను అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. విండీస్‌పై రాయ్ 94 బంతులు ఎదుర్కొని, 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కండరాలు చిట్లడంతో అతను అఫ్గాన్ మ్యాచ్‌తోపాటు, 21న శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌లోనూ బరిలోకి దిగడం లేదు. అతని ఫిట్నెస్ సమస్య ఇంగ్లాండ్ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. కాగా, మరికొంత మంది ఆటగాళ్లు కూడా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నారని అంటున్నారు. వాతావరణం ఆటకు అనుకూలంగా లేకపోవడం, మైదానం బురదమయం కావడం వంటి కారణాలతో ఆటగాళ్లు గాయాలబారిన పడుతున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.