క్రీడాభూమి

కివీస్‌ను ఆపగలదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్: మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఓడి, ఒక మ్యాచ్ వర్షంతో రద్దయన తర్వాత దక్షిణాఫ్రికా మొదటి విజయా న్ని నమోదు చేసింది. గెలిచింది పసికూన అఫ్గానిస్తాన్‌పైనే అయనా విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని సఫారీ ఆటగాళ్లు పేర్కొంటున్నారు. దీంతో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌పై తప్పకుండా విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆడిన తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధిం చిన కివీస్‌కు భారత్‌తో జరిగిన మ్యాచ్ రద్దయంది. 2015లోనే ముద్దాడాల్సిన ప్రపంచకప్‌ను కొద్దిలో దూరం చేసుకున్న కివీస్ ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ట్రోఫీని కైవసం చేసుకోవాలనే ఆలోచ నలో ఉంది.
బౌలింగే ఆయుధంగా..
ఈ మెగా టోర్నీలో ఇటు బ్యాటింగ్, అటు బౌలిం గ్‌లో రాణిస్తున్న న్యూజిలాండ్ జట్టు ప్రత్యర్థులను మొదట బౌలింగ్‌తోనే అడ్డుకుంటోంది. కివీస్ గెలిచిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే విధానాన్ని అవలంబించిం ది. ప్రతి మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించి దెబ్బకొడుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిర్ణయానికి తగ్గట్లు బౌలర్లు కూడా రాణిస్తుండడంతో గెలుపు సులువు అవుతోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ వంటి ప్రమాదకర బౌలర్లు తమ సత్తా చాటి, జట్టు గెలుపులో కీలక భూమిక పోషించారు.
కప్పుపై కసితో..
మొదటి మ్యాచ్ నుంచీ వ్యూహాత్మకంగా ఆడుతు న్న న్యూజిలాండ్ కప్పు కొట్టాలన్న కసితో బరిలోకి దిగుతోంది. బౌలింగ్ విభాగంలో బలంగా ఉన్న కివీస్ బ్యాటింగ్‌లోనూ అదే తీరు ప్రదర్శన కనబరుస్తోంది. మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో, కెప్టెన్ విలియమ్సన్, సీనియర్ బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్ రాస్ టేలర్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ వంటి అసాధారణ ఆటగాళ్లు ఉండడం కేన్ సేనకు కలిసొచ్చే అంశమే. అయతే గెలిచిన మూడు మ్యాచులు చిన్న జట్లపైనే కావడం, భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో నేడు జరిగే పోరులో దక్షిణాఫ్రికాపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాల్సిందే.
ఒక్క గెలుపుతో..
మెగా టోర్నీ అంటేనే కలిసిరాని జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా అనే చెప్పొచ్చు. ఈ టోర్నీ సఫారీలకు మొదటి నుంచీ కలిసి రావడం లేదు. గత ప్రపంచకప్‌లో సెమీస్‌కు వరకు వెళ్లగలిగినా వర్షం కారణంగా న్యూజిలాండ్‌ను విజయం వరించింది. ఈసారైనా టోర్నీని గెలుద్దామనుకుంటే ఆదిలోనే ఆతిథ్య జట్టుతో షాక్ తగిలింది. ఆ తర్వాత పసికూన బంగ్లాదేశ్‌తో పోరాడలేక చేతులెత్తిసింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెత్త ప్రదర్శన చేసి ఓటమి చవి చూసింది. ఆడిన మూడు మ్యాచుల్లో ఖాతా తెరవని ప్రొటీస్ జట్టుకు వెస్టిండీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మొదటి పాయంట్ లభించింది. ఆ తర్వాత పసికూన అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి ఈ మెగా టోర్నీలో మొదటి గెలుపు ఖాతా తెరిచింది. ఇదే ఊపులో న్యూజిలాండ్‌ను ఢీకొంటున్న దక్షిణాఫ్రికా గత ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? చూడాలి.
ఏడింట్లో రెండు మాత్రమే..
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మొత్తం 7సార్లు తలపడ్డాయ. ఇందులో దక్షిణాఫ్రికా కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించగా, మిగతా ఐదింట్లో న్యూజిలాండ్ గెలుపొందింది. 1996, 1999లో అప్పటి సఫారీ కెప్టెన్ హాన్సీ క్రోనే్య సారథ్యంలో మాత్రమే విజయం సాధించింది. ఇక 1992, 2003, 2007, 2011, 2015లో కివీస్ గెలుపొందింది. చివరగా ఈ రెండు జట్లు 2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో తలపడగా డక్ వర్త్ లూయస్ పద్ధతిలో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.

చిత్రం...ప్రాక్టీస్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు