క్రీడాభూమి

ప్రపంచకప్ టోర్నీ నుంచి గబ్బర్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 19: ప్రపంచకప్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ చేతి బొటన వేలికి గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ధావన్ స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. జూన్ 9న ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ గాయపడిన విషయం తెలిసిందే. కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో ధావన్ చేతికి బంతి బలంగా తగిలింది. ఓవైపు నొప్పితో ఇబ్బంది పడుతూనే సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత గాయం సమస్య వేధించడంతో ఫీల్డింగ్‌కు కూడా రాలేకపోయాడు. గబ్బర్‌ను పరీక్షించిన వైద్యులు తొలుత మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పినా, తాజాగా జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కూడా అతడు కోలుకునే పరిస్థితి లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది.