క్రీడాభూమి

డేర్‌డెవిల్స్‌కు అగ్ని పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, మే 19: ఐపిఎల్ నాకౌట్ దశకు చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొనేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ సిద్ధమవుతున్నది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలు సాధించింది. మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలా 14 పాయింట్లు సంపాదించాయి. డేర్‌డెవిల్స్ ఖాతాలో కేవలం 12 పాయింట్లు ఉన్నాయి. దీనితో శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిస్తే తప్ప ఆ జట్టుకు నాకౌట్ చేసే అవకాశం ఉండదు. అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్న ఢిల్లీ తన ప్రయత్నంలో సఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశీలకుల అభిప్రాయం.