క్రీడాభూమి

అమ్లా ఖాతాలో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 19: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరుగు తున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నా డు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత వేగంగా 8వేల పరుగులు సాధించిన రెండో ఆట గాడిగా ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా 24 పరుగుల మార్క్ చేరుకోగానే ఈ రికార్డు అతడి సొంతమైంది. ఆమ్లా ఈ ఫీట్‌ను అందుకోవడా నికి 176 ఇన్నింగ్స్‌లు పట్టింది. అంతకుముందు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 175 ఇన్నింగ్స్‌ల్లో 8వేల పరుగులు సాధించి అంద రికంటే ముందువరుసలో నిలిచాడు. కోహ్లీ తర్వాత ఆమ్లా రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇదిలాఉంటే దక్షిణాఫ్రికా ఆటగా ళ్లలో మాత్రం ఆమ్లా మొదటి స్థానంలో నిలిచాడు. అమ్లా తర్వాత మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 182 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
నాలుగో బ్యాట్స్‌మన్‌గా..
దక్షిణాఫ్రికా క్రికెటర్లలో 8వేల పరుగులు పూర్తిచేసుకున్న నాలుగో ఆటగాడిగా హషీమ్ ఆమ్లా మరో ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు సఫారీ బ్యాట్స్‌మెన్లలో 8వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో మాజీ ఆటగాళ్లు జాక్వెస్ కలిస్ (11,579), ఏబీ డివిలియర్స్ (9577), హర్షల్ గిబ్స్ (8094)లు అమ్లా కంటే ముందువరుసలో ఉన్నారు.
8వేల పరుగులు పూర్తి చేసుకున్న
చిత్రం...దక్షిణాఫ్రికా బ్యాట్‌మన్ హషీమ్ ఆమ్లా