క్రీడాభూమి

ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత బృందానికి బింద్రా సారథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మ్యూనిచ్, మే 20: జర్మనీలోని మ్యూనిచ్‌లో గురువారం నుంచి ప్రారంభమైన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) థర్డ్ లెగ్ ప్రపంచ కప్ (రైఫిల్/పిస్తోల్) పోటీల్లో పాల్గొంటున్న 25 మంది సభ్యుల భారత బృందానికి ఒలింపిక్ మాజీ చాంపియన్ అభినవ్ బింద్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత బృందంలో 17 మంది షూటర్లు, ఎనిమిది మంది అధికారులు ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న పలువురు షూటర్లు ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుండటం, రియో ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి మరో మూడు నెలల వ్యవధి కూడా లేకపోవడంతో ఇప్పుడు అందరూ వీరిపైనే దృష్టి సారిస్తున్నారు. అభినవ్ బింద్రాతో పాటు ప్రపంచ కప్ జట్టులో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జీతూ రాయ్, గగన్ నారంగ్, చైన్ సింగ్, అపూర్వీ చండీలా, అయోనికా పాల్, గుర్‌ప్రీత్ సింగ్, పిఎన్.ప్రకాష్, హీనా సిద్ధు తదితరులు రియో ఒలింపిక్స్‌కు కూడా ఎంపికవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన రెండు రైఫిల్/పిస్తోల్ ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఒక పసిడి పతకాన్ని సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో జీతూ రాయ్ (28) భారత్‌కు ఈ పతకాన్ని అందించాడు. సైనిక దళంలో పనిచేస్తున్న జీతూ రాయ్ ఈ పోటీల్లో జరిగిన పురుషుల 50 మీట్లర్ల పిస్తోల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటుకోవడంతో పాటు ఈ పోటీలు ముగిసిన తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు షూటింగ్ ఈవెంట్లలోనే అధిక పతకాలు వస్తాయని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభమయ్యే రియో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు 12 కోటా బెర్తులు కైవసం చేసుకున్నారు. వాస్తవానికి ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇంత ఎక్కువ మంది షూటర్లు ప్రాతినిధ్యం వహించనుండటం ఇదే తొలిసారి.