క్రీడాభూమి

ముంబయ ఇండియన్స్‌కు ప్రాణసంకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ జట్టు గుజరాత్ లయన్స్‌తో చావో-రేవో తేల్చుకోనుంది. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో ఈ రెండు జట్లకు చివరిదైన ఈ లీగ్ మ్యాచ్ శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ ప్లే-ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించడం మినహా మరో గత్యంతరం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 13 లీగ్ మ్యాచ్‌లలో ఏడు విజయాలు సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు 14 పాయింట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సరిసమానంగా నిలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుం ఐదో స్థానంలో ఉంది. అయితే ముంబయి ఇండియన్స్ కంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌ను కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలువగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. కనుక ముంబయి ఇండియన్స్ ప్లే-ఆఫ్ దశకు చేరుకునే ఆశలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే శనివారం గుజరాత్ లయన్స్‌పై తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఓటమి ఎదురైతే ప్లే-ఆఫ్ రేసు నుంచి ఆ జట్టు వైదొలగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించి ప్లే-ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవడంతో పాటు గత నెల 16వ తేదీన జరిగిన హోమ్ లెగ్ మ్యాచ్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబయి ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటివరకూ ఆడిన 13 లీగ్ మ్యాచ్‌లలో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్న గుజరాత్ లయన్స్ శనివారం మరోసారి ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ప్లే-ఆఫ్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌కు ఓటమి ఎదురైతే చివరి క్షణాల్లో ఇతర జట్లు ప్లే-ఆఫ్ దశకు చేరుకునేందుకు ద్వారాలు తెరిచినట్లవుతుంది.
విశాఖలో పుణె-పంజాబ్ పోరు
ఇదిలావుంటే, విశాఖపట్నంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, మురళీ విజయ్ నేతృత్వంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన 13 మ్యాచ్‌లలో 8 పాయింట్ల చొప్పున సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ జట్లు ప్లే-ఆఫ్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించడంతో శనివారం ఈ రెండు జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌పై అభిమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ పుణె సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో విజయంతో ఈ సీజన్‌ను ముగించాలని రెండు జట్లు ఎదురుచూస్తున్నాయి.
నిర్వహణపై అనుమానాలు
అయతే ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. విశాఖలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఈ మ్యాచ్ జరుగుతుందో? లేదో? అని క్రికెట్ అభిమానులు అనుమానపడుతున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం మ్యాచ్‌పై ప్రభావాన్ని చూపుతుందని భావివస్తున్నారు. అయితే పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్‌ను సైతం వర్షం నుంచి రక్షించేందుకు స్టేడియం సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఔట్ ఫీల్డ్ మొత్తాన్ని పరదాలతో కప్పి ఉంచారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి, శనివారం మధ్యాహ్నం వరకూ ఎండ రాకపోతే మాత్రం మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో విశాఖలో నిర్వహించే చివరి మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు.
పిసిబికి లాభాల పంట!
కరాచీ, మే 20: ఆటగాళ్ల భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని జింబాబ్వే మినహా టెస్టు హోదాగల ఏ ఒక్క జట్టూ పాకిస్తాన్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కుదేలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆర్థికంగా నష్టపోయింది. దివాలా పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)తో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని పిసిబి అధికారులు అంటున్నారు. ఇటీవల పిఎస్‌ఎల్ ద్వారా 2.6 మిలియన్ డాలర్లు (సుమారు 16.9 కోట్ల రూపాయలు) లాభం వచ్చిందని పిసిబి ప్రకటించింది. టి-20 ఫార్మెట్‌లో గత ఏడాది ఈ టోర్నీని ప్రవేశపెట్టగా, మొదటి ఏడాది భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఈసారి నష్టాలనను అధిగమించి లాభాల బాట పట్టిందని పిసిబి తెలిపింది. టెలివిజన్ హక్కులు, గేమ్ మనీ రూపంలోనే 8 మిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని వివరించింది.