క్రీడాభూమి

రెండో స్వర్ణం సాధించిన దుతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తావోయువాన్ సిటీ (తైవాన్), మే 20: ఇక్కడ జరుగుతున్న తైవాన్ ఓపెన్ అథ్లెటిక్ మీట్‌లో శుక్రవారం మన దేశానికి చెందిన యువ స్ప్రింటర్ దుతీ చాంద్ మహిళల 200 మీటర్ల రేస్‌లో బంగారు పతకాన్ని సాధించింది. ఈ రేస్‌లో మూడు పతకాలు కూడా మన దేశానికే లభించడం గమనార్హం. దుతీ 23.52 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా, శ్రాబణి నందా, హెచ్‌ఎం జ్యోతిలు వరసగా 23.55 సెకన్లు, 23.92 సెకన్లతో రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. ఈ నెల 18న బీజింగ్‌లో జరిగిన ఐఏఏఎఫ్ ప్రపంచ చాలెంజ్‌లో మహిళల 400 మీటర్ల రిలేలో జాతీయ రికార్డు సృష్టించిన బృందంలో ఈ ముగ్గురూ ఉన్నారు. కాగా, గురువారం మహిళల వందమీటర్ల రేస్‌లో సైతం దుతీ స్వర్ణ పతకం సాధించింది. అయితే ఆమె 11.50 సెకన్ల స్లో టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేయడంతో రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. రియో ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడానికి దుతీ ఈ రేస్‌ను 11.32 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉండింది. గత నెల న్యూఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్ మీట్‌లో దుతీ వందమీటర్ల రేస్‌ను 11.33 సెకన్లలో పరుగెత్తింది. దీంతో ఆమె రియో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవుతుందనే ఆశలు అందరిలో తలెత్తాయి. కాగా, ఈ రోజు దుతీ, శ్రాబణి ఇద్దరి టైమింగ్స్ కూడా గత నెల న్యూఢిల్లీలో వారు 200 మీటర్ల రేస్‌హీట్స్‌లో నెలకొల్పిన టైమింగ్స్ 23.34 సెకన్లు, 23,36 సెకన్లకన్నా తక్కువే కావడం గమనార్హం. కాగా, శువ్రారం ఈ పోటీల్లో పాల్గొన్న మిగతా భారతీయ అథ్లెట్లు అందరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. అథ్లెట్లుఅందరు కూడా ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడమే లక్ష్యంగా పెట్టుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి పేలవమైన 1ప్రదర్శన కనబరచిన వారిని ఇంతదూరం ఈ టోర్నమెంట్‌కు ఎందుకు పంపించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.