క్రీడాభూమి

బంగ్లాదే పైచేయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడ నున్నాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు గెలుపు రుచి చూడని అఫ్గానిస్తాన్‌ను ఢీకొనబోతుంది. అయతే రెండు జట్లలో ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
గెలుపుపై ధీమాగా..
ఆడిన ఆరు మ్యాచుల్లో ఓడిన అఫ్గానిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపుపై ధీమాగా ఉంది. భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో దాదాపు గెలు పు అంచులవరకు వచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయంది. లేదంటే అగ్రశ్రేణి జట్టు అయనా భారత్‌కు ఈ టోర్నీలో పసికూన నుంచి మొదటి షాక్ తగిలి ఉండేది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన అఫ్గాన్ నాణ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది. భారత్ వంటి జట్టును కేవలం 223 పరుగులకే కట్టడి చేసింది. కెప్టెన్ గుల్బదీన్ నబీతో పాటు మహమ్మద్ నబీ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. కానీ చివర్లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ అవుట్ వెనుదిరగడంతో అఫ్గాన్ విజయం దూరమైంది. అయతే మహమ్మద్ నబీకి సహకారం అందించే వారు లేకపోవడం కూడా ఓటమికి మరో కారణం. నబీకి ముందు రహ్మాత్ షా (36) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశాడు. ప్రపంచ నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్‌ను నబీ ఎదుర్కొని చివరి వరకు క్రీజులో పాతుకుపోవడం క్రికెట్ అభిమా నుల్ని ఆకట్టుకుంది.
బౌలింగే బలం..
పసికూనగా టోర్నీలో అడుగుపెట్టిన అఫ్గాన్ జట్టుకు ప్రధాన బలం బౌలింగే. ముజీజ్ ఉర్ రహమన్, ఆఫ్తాబ్ ఆలం, కెప్టెన్ గుల్బదీన్ నబీ, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, రెహ్మాత్ షా వంటి బౌలర్లు ఎలాంటి జట్టునైనా తమ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టగలరు. గత మ్యాచులన్నింటిలో గమనిస్తే అఫ్గాన్ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలవకపోయనా చివరివరకు క్రీజులో ఉండి పోటీ జట్లకు దడ పుట్టిస్తోంది.
బంగ్లాకే అనుకూలం..
గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంతో పరిణితి చెందింది. అగ్రశ్రేణి జట్లపై విజయాలు నమోదు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఈ మెగా టోర్నీలోనూ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు 21 పరుగుల తేడాతో నెగ్గి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా కేవలం 6 వికెట్లను మాత్రమే కోల్పోయ 330 పరుగు లను చేసింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ ద్వారా ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి విజయంతో మెగా టోర్నీని ప్రారంభించింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో, ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయతే శ్రీలంకతో జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం బంగ్లా జట్టుకు పెద్ద దెబ్బే. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ జరిగి ఉంటే కచ్చితంగా గెలిచేదని ఆ దేశ అభిమానులు పేర్కొం టున్నారు. అయతే ఆ తర్వాత విండీస్‌తో గెలిచినా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల స్వల్ప తేడాతో మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.
కరేబియాన్‌పై కసితో..
ప్రపంచకప్‌కు ముందు ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన ట్రై సిరీస్‌లో విజేతగా నిలిచిన బంగ్లాదేశ్, ఆ సిరీస్‌లో రెండు సార్లు వెస్టిండీస్‌ను ఓడించింది. మెగా టోర్నీలో ఈ నెల 17న తలపడ్డ ఈ రెండు జట్లు అభి మానులకు అసలైన క్రికెట్ మాజా చూపించాయ. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 321 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించగా, బంగ్లాదేశ్ కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. ఇదే ప్రదర్శనతో సోమవారం అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకో వాలని ఉవ్విళ్లూరుతోంది. తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, షకీబ్ అల్ హసన్ ముష్ఫీకర్ ర హీమ్, లిటన్ దాస్ వంటి బ్యాట్స్‌మెన్లతో పాటు మషఫ్రె మోర్తాజా, మహమ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, మెహిడీ హసన్, మోసాదిక్ హుస్సేన్ వంటి ప్రమాదకర బౌలర్లు ఉండడం బంగ్లాదేశ్ కు కలిసొచ్చే అంశం.
ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తలపడడం ఇది రెండోసారి. మొదటి సారిగా 2015 ప్రపంచక ప్‌లో ఈ రెండు జట్టు పోటీ పడగా బంగ్లాదేశ్ 105 పరుగుల తేడాతో ఘన విజ యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటిం గ్ చేసిన బంగ్లాదేశ్ 262 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిం చగా, అఫ్గానిస్తాన్ 162 పరుగులకే కుప్పకూలింది.

చిత్రాలు.. షకీబ్ అల్ హసన్ *మహమ్మద్ నబీ