క్రీడాభూమి

ఉబెర్ కప్ టోర్నీలో మళ్లీ కాంస్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కున్హాన్ (చైనా), మే 20: ఉబెర్ కప్ మహిళల బాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు మరోసారి కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. చైనాలోని కున్హాన్‌లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు 0-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చైనా చేతిలో ఓటమిపాలవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. తొలుత సింగిల్స్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి.సింధు భారత్‌కు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. క్వార్టర్ ఫైనల్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి రచనోక్ ఇంతనాన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న సైనా నెహ్వాల్ తాజాగా చైనా క్రీడాకారిణి లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా చేతులెత్తేసింది. 64 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను 15-21 తేడాతో కోల్పోయిన సైనా ఆ తర్వాత కాస్త పుంజుకుని 21-12 తేడాతో రెండో గేమ్‌ను గెలుచుకుంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో ప్రత్యర్థి విజృంభించడంతో 17-21 తేడాతో ఆ గేమ్‌ను కోల్పోయిన సైనాకు ఓటమి తప్పలేదు. లీ చేతిలో సైనా పరాజయాన్ని ఎదుర్కోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి. అనంతరం జరిగిన మరో సింగిల్స్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి షిగ్జియాన్ వాంగ్ వరుస గేముల తేడాతో పివి.సింధును ఓడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతున్న వాంగ్ 50 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-13, 23-21 తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగోసారి సింధును ఓడించింది. ఆ తర్వాత తియాన్ క్వింగ్, జావో యున్‌లెయి జోడీతో జరిగిన డబుల్స్ తొలి మ్యాచ్‌లో జ్వాలా గుత్తా, సిక్కీ రెడ్డి కూడా చేతులెత్తేశారు. 25 నిమిషాల పాటు పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ పోరులో చైనా జోడీ 21-6, 21-6 గేముల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతో ఇంతకుముందు న్యూఢిల్లీలో జరిగిన ఎడిషన్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు తాజాగా కున్హాన్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో మళ్లీ అదే ఫలితం ఎదురైంది.