క్రీడాభూమి

నెట్స్‌లో భువీ బౌలింగ్ ప్రాక్టీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 25: పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా కండరాలు పట్టే యడంతో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమా ర్ మధ్యలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. భువి బ్యాకప్ ప్లేయర్‌గా నవదీప్ షైనీ ఇంగ్లాండ్‌కు వెళ్లడంతో అతడి గాయంపై అభిమానుల్లో ఆందో ళనలు కలిగాయి. అయతే తాజాగా స్థానిక ఇండోర్ నెట్స్‌లో భువనేశ్వర్ బౌలింగ్ చేసిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. అయతే అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో భువనేశ్వర్ స్థానం లో జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్లతో భారత్ గెలిపించిన సంగతి తెలిసిందే. గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్‌లో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్లో భువీ తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువే. భారత్ ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో 4 గెలిచి 9 పాయంట్లతో పట్టిక మూడో స్థానంలో కొనసా గుతోంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో జరిగిన అన్ని మ్యాచుల్లో ఓటమి ఎరుగని జట్లుగా భారత్, న్యూజిలాండ్ నిలిచాయ. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

చిత్రం... నెట్స్‌లో జట్టు ఫిజియో థెరపిస్ట్ పాట్రిక్ ఫర్హార్‌తో మాట్లాడుతున్న భువనేశ్వర్ కుమార్