క్రీడాభూమి

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 25: భారత్‌తో ఓటమి అనం తరం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘోర పరాజయం అనంతరం తమ జట్టుపై అన్ని వర్గాల నుంచి వచ్చిన విమర్శ లు, ట్రోలింగ్‌తో తనపై నెలకొన్న ఒత్తిడి తట్టుకోలే కపోయానని తెలిపాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజ యం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన పాక్ తమ తదు పరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో బుధవారం ఆడ నుంది. ఈ నేపథ్యంలో మిక్కీ మీడియాతో ముచ్చ టించాడు. ‘పోయన ఆదివారం నేను చచ్చి పోవా లనుకున్నాను. చూస్తుండగానే మ్యాచ్‌ను కోల్పో యాం. ఒక్క చెత్త ప్రదర్శన కారణంగా ఆ ఆలోచన కలిగింది. ఒక్క మంచి ప్రదర్శన చేస్తే అన్నీ సర్దు కుంటాయని ఆలోచించా. ఇది ప్రపంచకప్ కాబట్టి మీడియాలో సమీక్షలు, అభిమానుల అంచనాలు అన్ని సాధారణమే’ అని సర్దుకున్నట్లు చెప్పాడు. అయితే ఆర్థర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఒక్క ఓటమికే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వచ్చాయా? అంటూ నెటిజ న్లు మండిపడుతు న్నారు. ఆటగాళ్లలో స్ఫూర్తి నిం పాల్సిన కోచ్ ఇలా ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.