క్రీడాభూమి

అమీర్‌కు బ్రిటీష్ వీసా కోసం పిసిబి దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, మే 20: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషి అయిన పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్‌కు బ్రిటీష్ వీసా కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) శుక్రవారం దరఖాస్తు సమర్పించింది. బ్రిటన్ గనుక అమీర్‌కు వీసా మంజూరు చేసిన పక్షంలో అతను వచ్చే జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించే పాక్ క్రికెట్ జట్టు వెంట వెళ్లడానికి వీలవుతుంది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు అమీర్‌తో పాటుగా అప్పుడు పాక్ జట్టు కెప్టెన్‌గా ఉండిన సల్మాన్‌బట్, మరో బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అయిదేళ్ల పాటు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే అమీర్ తన నేరాన్ని అంగీకరించడంతో ఆరు నెలలు ముందుగానే అతను డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడడానికి అనుమతించడం జరిగింది. అమీర్ వీసా దరఖాస్తును ఈ రోజు ఇస్లామాబాద్‌లోని బ్రిటీష్ హైకమిషన్‌లో సమర్పించడం జరిగిందని, దరఖాస్తు ప్రక్రియను అతను పూర్తి చేశాడని పిసిబి ఒక ప్రకటనలో తెలిపింది. ఇంగ్లండ్ పర్యటనలో అమీర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని పిసిబి నావిస్తోంది. ఈ పర్యటనలో పాక్ నాలుగు టెస్టులు, అయిదు వన్‌డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్ ఆడనుంది. కాగా, న్యూజిలాండ్ గత జనవరిలో అమీర్‌కు వీసా మంజూరు చేయడం, ఐసిసి అతని పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించడం ఇప్పుడు అతనికి అనుకూలంగా మారుతాయని పిసిబి భావిస్తోంది.

విండీస్ సెలెక్టర్లపై
గేల్, బ్రావో, సమీ ధ్వజం
న్యూఢిల్లీ, మే 20: స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్న ముక్కోణపు వన్‌డే సిరీస్‌కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు తమను ఎంపిక చేయక పోవడంపై సీనియర్ క్రికెటర్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, డారెన్ సమీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన ప్రపంచ టి-20 టోర్నమెంట్ టైటిల్‌ను దక్కించుకున్న వెస్టిండీస్ జట్టులో ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వన్‌డే జట్టులో తమకు స్థానం కల్పించకపోవడమే కాక కీరన్ పోలార్డ్, సునీల్ నారైన్‌లకు జట్టులో స్థానం కల్పించడంపై వారు మండిపడుతున్నారు. సెలెక్టర్ల తీరుపై బ్రావో ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని జోక్ ఆఫ్‌ది డేగా అభివర్ణించిన బ్రావో టి-20 ప్రపంచ టోర్నమెంట్‌కు పనికిరాని పోలార్డ్, నారైన్‌లు ఇప్పుడు ముక్కోణపు సిరీస్‌కు ఎలా పనికొచ్చారో తనకు అర్థం కావడం లేదన్నాడు.
అంతేకాదు డొమెస్టిక్ సూపర్ 50 టోర్నమెంట్‌కు పనికిచ్చిన తాము ఇప్పుడు ఎందుకు పనికి రాలేదో అర్థం కావడం లేదని కూడా బ్రావో అన్నాడు. కాగా, గేల్, సమీలు కూడా ట్విట్టర్‌లో సెలెక్టర్ల తీరుపై మండిపడ్డారు. ముఖ్యంగా పోలార్డ్ పేరును తన ట్వీట్‌లో ప్రస్తావించిన సమీ అతనికి అభినందనలు తెలుపుతూనే, 2014నుంచి సూపర్ 50 లేదా వన్‌డేలలో ఆడని నువ్వు ఎలా ముక్కోణపు సిరీస్‌కు ఎలా క్వాలిఫై అయ్యావో చెప్పాలని ప్రశ్నించాడు.