క్రీడాభూమి

భారత్, పాక్ మ్యాచ్‌ను వంద కోట్ల మంది వీక్షించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, జూన్ 25: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఇరుదేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చూపుతారు. తాజాగా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మాంచెస్టర్ వేదికగా ఈ నెల 16న తలపడ్డ భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలను ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది చూశారు. డిజిటల్, సోషల్ మీడియాల ద్వారా మాత్రమే చూసిన ప్రేక్షకుల సంఖ్యను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ మ్యాచ్‌ను వీక్షించిన వారి సంఖ్యను నిర్దారించింది. టీవీల ద్వారా చూసిన వారి సంఖ్యను లెక్కలోకి తీసుకోలేదు. క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా, ఏ క్రీడా ఈవెంట్‌ను కూడా వంద కోట్ల మంది ఇప్పటివరకు చూసిన సందర్భాలు లేవు. మ్యాచ్‌కు సంబంధించిన వీడియో లింక్‌ను సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలపై పోస్ట్ చేయగా వంద కోట్లకు పైగా హిట్స్ వచ్చినట్లు ఐసీసీ అధికారికంగా వెల్లడించింది. టీవీల ద్వారా ఈ మ్యాచ్‌ను 3.42 కోట్ల మంది వీక్షించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వీక్షకుల సంఖ్య ఒకేసారి 15లక్షల 60 వేలకు చేరుకుం దని, క్రమక్రమంగా పెరుగుతూ వెళ్లిందని హాట్ స్టార్ యాజమాన్యం వెల్లడించింది.