క్రీడాభూమి

లారా ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 26: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పూర్తి ఫిట్నెస్‌తో, ఇక్క డి ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అ య్యాడు. ట్రినిడాడ్‌కు చెందిన 50 ఏళ్ల లారా క్రికెట్ చరిత్రలోనే ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. కాగా, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి రావడంతో అతనిని పరేల్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్చారు. అతను పూర్తి ఫిట్నెస్‌తో, బాగానే ఉన్నాడనీ ఆసుపత్రి వర్గాలు పీటీఐకి తెలిపాయి. అయితే, ఇతరత్రా వివరాలను అందించలేదు. కాగా, మంగళవారం సాయంత్రి జిమ్‌లో వర్కౌట్ చే స్తుండగా, ఛాతీలో నొప్పిగా అనిపించిందని, అందుకే, వైద్యులను సంప్రదించానని లారా తెలిపాడు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని, ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించాడు. కెరీర్‌లో 131 టెస్టులు ఆడిన లారా 11,953 పరుగులు సాధించిన అతను 299 వనే్డ ఇంట్నేషనల్స్‌లో 10,405 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీల విశే్లషకుడిగా ఓ చానెల్‌కు సేవలు అందిస్తున్నాడు.