క్రీడాభూమి

కోహ్లీ ముందు మరో రికార్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 26: అంతర్జాతీయ వనే్డల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందిన టీమిండి యా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో నిలిచాడు. గురువారం వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ 37 పరుగులు చేస్తే అంతర్జా తీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా 20 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించనున్నాడు. అంతే కాకుండా 20 వేల పరుగులు పూర్తిచేసుకున్న 12వ బ్యాట్స్‌మన్‌గా, భారత్ నుంచి 3వ ఆటగాడిగా నిలవనున్నాడు. కోహ్లీ కంటే ముందు టీమిండియా నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34,357), రాహుల్ ద్రావిడ్ (24,208) ఉన్నారు. కాగా, 20 వేల పరుగుల మార్క్ దాటడానికి క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ , బ్రియాన్ లారాలకు 453 ఇన్నింగ్స్‌లు పట్టగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 37 పరుగులు సాధిస్తే కోహ్లీకి మాత్రం 20 వేల పరుగుల మార్క్ దాటేందుకు కేవంల 416 ఇన్నింగ్స్‌లు పట్టినట్లు. ఇప్పటికే విరాట్ వనే్డల్లో 11,087 పరుగులు సాధించగా, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 రన్స్ చేశాడు.