ఆటాపోటీ

మహిళల్లో ఒక్కరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్ క్రీడాకారులు టైటిల్ సాధించడం చాలా అరుదు. పురుషుల విభాగంలో మార్సెల్ బెర్నార్డ్ (1946), మాట్స్ విలాండర్ (198), గుస్టావో కుయెర్టర్ (1997), గస్టాన్ గైడో (2004) అన్‌సీడెడ్స్‌గా బరిలోకి దిగి టైటిల్ సాధించారు. మహిళల విభాగంలో మార్గరెట్ ష్రివెన్ మాత్రమే ఈ ఫీట్‌ను నమోదు చేసింది. 1933లో ఆమె సాధించిన ఈ ఘనతను ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. 1912 ఆగస్టు 12న లీడ్స్‌లో జన్మించిన ష్రివెన్ 2001 జనవరి 25న తన 88వ ఏట మృతి చెందింది. 1933లో అన్‌సీడెడ్‌గా మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన ఆమె 6-2, 4-6, 6-4 తేడాతో సిమోనే నథియూను ఓడించి టైటిల్ సాధించింది. మరుసటి సంవత్సరం కూడా విజేతగా నిలిచింది. ఫైనల్‌లో హెలెన్ జాకబ్స్‌పై 7-5, 4-6, 6-1 ఆధిక్యంతో గెలిచింది. ఒక గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను వరుసగా రెండు పర్యాయాలు సొంతం చేసుకున్న చివరి బ్రిటిష్ క్రీడాకారిణి ఆమే. 83 సంవత్సరాలుగా ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోవడం విశేషం.