క్రీడాభూమి

డిఫెండింగ్ చాంపియన్ ముంబయ ఇంటికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 21: ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసిన డిఫెండింగ్ చాంపియన్ ముంబయ ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం నాటి మ్యాచ్‌ల ఫలితాలు తెలిసన తర్వాత ప్లే ఆఫ్ జట్లు ఖరారవుతాయ. ఇలావుంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 173 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ 70, కెప్టెన్ రోహిత్ శర్మ 30, జోస్ బట్లర్ 33 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లకు 173 పరుగులు చేసి విజయభేరి మోగించింది. బ్రెండన్ మెక్‌కలమ్ 48, కెప్టెన్ సురేష్ రైనా 58 పరుగులతో రాణించారు. చివరిలో డ్వెయన్ స్మిత్ 37, రవీంద్ర జడేజా 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.