క్రీడాభూమి

ఐపిఎల్‌లో నేడు నాకౌట్ మ్యాచ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా/ రాయ్‌పూర్, మే 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గ్రూప్ దశ పోటీలు ఆదివారంతో పూర్తవుతాయి. 24 నుంచి ప్లే ఆఫ్ పోరు మొదలవుతుంది. ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలితేగానీ, ప్లే ఆఫ్ దశకు చేరుకునే జట్లను ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు చెరి నాలుగు విజయాలు, తొమ్మిది పరాజయాలతో ఎనిమిదేసి పాయింట్లు మాత్రమే సంపాదించుకొని టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా, ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సాయంత్రం 4 గంటలకు ఆరంభమయ్యే కీలక మ్యాచ్‌లో టేబుల్‌లో రెండో స్థానంలోవున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఎవరూ ఊహించని విధంగా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. ఈ జట్టు ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి, ఎనిమిది విజయాలు సాధించింది. ఐదు పరాజయాలను చవిచూసింది. మొత్తం 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌లో స్థానం సంపాదించింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా సన్‌రైజర్స్ నాకౌట్ అవకాశాలకు ఎలాంటి నష్టం ఉండదు. మరీ దారుణంగా విఫలమైన, ఎవరూ ఊహించలేనంత భారీ తేడాతో పరాజయాన్ని చవిచూస్తే తప్ప ఈ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే, సన్‌రైజర్స్‌తో తలపడుతున్న నైట్‌రైడర్స్‌కు మాత్రం ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. గౌతం గంభీర్ నాయకత్వంలోని నైట్‌రైడర్స్ ఈ మ్యాచ్‌ని గెలిస్తే రేసులో ఉంటుంది. లేకపోతే, 14 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇలావుంటే, రాయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు మొదయ్యే మరో కీలక మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీ కొంటాయి. ఈ రెండు జట్లకూ ఇది అత్యంత కీలకంగా మారింది. ఇరు జట్లు చెరి 13 మ్యాచ్‌లు ఆడి, ఏడు విజయాలు సాధించాయి. ఆరు ఓటములను చవిచూశాయి. చెరి 14 పాయింట్లతో సమవుజ్జీగా నిలిచాయి. కానీ, నెట్న్ రేట్‌ను ఆధారంగా తీసుకుంటే, డేర్‌డెవిల్స్ కంటే విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న బెంగళూరు మెరుగైన స్థితిలో ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ సేన గెలిస్తే ప్లే ఆఫ్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ డేర్‌డెవిల్స్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకుంటుంది.