క్రీడాభూమి

సెమీస్‌కు అంపైర్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూలై 7: ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ల అంపైర్లు ఖరారయ్యారు. ఫీల్డ్ అంపైర్లతోపాటు, థర్డ్, ఫోర్త్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎంపిక చేసింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్లుగా వ్యవహరిస్తారని ప్రకటించింది. శనివారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో గ్రూప్ దశ ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం ఐసీసీ నాకౌట్ దశ మ్యాచ్‌లపై దృష్టి సారించింది. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కి ఫీల్డ్ అంపైర్లతోపాటు, థర్డ్ అంపైర్‌గా రాడ్ టకర్ (ఆస్ట్రేలియా), ఫోర్త్ అంపైర్‌గా నికెల్ లాంగ్ (ఇంగ్లాండ్)ను ఎంపిక చేసింది. మ్యాచ్ రిఫరీగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ బూన్ వ్యవహరిస్తాడని ఆ ప్రకటనలో వివరించింది.
ఇలావుంటే, గురువారం ఎడ్జిబాస్టన్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు పోటీపడుతున్న రెండో సెమీ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మరాస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. థర్డ్ అంపైర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫనే ఉంటాడు. అలీం దార్ (పాకిస్తాన్) ఫోర్త్ అంపైర్‌గా, రంజన్ ముదుగలే (శ్రీలంక) మ్యాచ్ రిఫరీగా సేవలు అందిస్తారు.