క్రీడాభూమి

అందరి వాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూలై 7: మహేంద్ర సింగ్ ధోనీ.. కేవలం ఒక పేరు కాదు.. ఓ నమ్మకం.. ఎంతో మంది యువ క్రికెటర్ల ఆత్మవిశ్వాసానికి కారణం.. స్ఫూర్తిదాయకమైన నాయకత్వానికి నిలువెత్తు రూపం.. అంకిత భావానికి నిదర్శనం.. నాయకత్వం ఉన్నా, లేకున్నా జట్టు కోసం సర్వశక్తులు ఒడ్డే గొప్ప వ్యక్తిత్వానికి సజీవ సాక్ష్యం.. అందుకే, వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచి కూడా ధోనీ బ్యాటింగ్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరకూ ప్రతి ఒక్కరూ అతనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ‘్ధనీ ఇంతకు ముందేకాదు.. ఇప్పుడు కూడా నాకు కెప్టెనే. అతను ఇచ్చే ఏ సూచననైనా పాటిస్తాను. ఏ సలహానైనా అమలు చేస్తాను’ అని కోహ్లీ ఇది వరకే స్పష్టం చేశాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లకు కూడా ధోనీ పట్ల ఎంతో నమ్మకం. అతను అందరి వాడు.. అజాతశత్రుడు.. కుల్దీప్ యాదవ్ లేదా యుజువేంద్ర చాహల్.. ఫీల్డింగ్ లేదా బౌలింగ్ సమయంలో ప్రత్యర్థుల నుంచి ఎవరు ఎలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొన్నా, నేనున్నానంటూ వచ్చే వ్యక్తి ధోనీ. జానీ బెయిర్‌స్టో లేదా ఏంజెలో మాథ్యూస్ ఎవరు విమర్శలు కురిపించినా, ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడం అతని ప్రత్యేకత. అంతేకాదు.. అవహేళనలను తట్టుకోలేక యువ ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా ధోనీ చేసే ప్రయత్నాలు, సముదాయించే విధానం, అందించే భరోసా అనన్యసామాన్యం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ఆటగాళ్ల భుజాలపై చేతులేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ధోనీ వంటి అతి కొద్దిమంది క్రికెటర్లకే సాధ్యమవుతుంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను హ్యాట్రిక్ సాధించడానికి ధోనీ ఇచ్చిన సూచనే కారణమని మహమ్మద్ షమీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. తాను హ్యాట్రిక్ బంతిని ఎలా వేయాలని మల్లగుల్లాలు పడుతున్నప్పుడు, యార్కర్‌ను సంధించాలని ధోనీ సూచించనట్టు షమీ తెలిపాడు. అతను చెప్పిన విధంగానే బంతి వేశానని, హ్యాట్రిక్ సాధించానని పేర్కొన్నాడు. షమీ ఒక్కడేకాదు.. ధోనీతో కలిసి మైదానాన్ని, డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న ప్రతి క్రికెటర్ అతని గురించి ఎంతో గొప్పగా చెప్తారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లకు అతను ఓ మార్గదర్శి. మడమతిప్పని నేత. సలహాలు, సూచనలు ఇచ్చే అధ్యాపకుడు. అందుకే, ధోనీ 38వ పుట్టిన రోజును టీమిండియా ఓ కమ్మని వేడుకగా జరుపుకొంది.
మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ అందరినీ ఆకట్టుకునే రీతిలో, ధోనీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.
‘ప్రపంచంలో ఏడు ఖండాలు... వారానికి ఏడు రోజులు... ఇంద్ర ధనస్సులో ఏడు రంగులు.. సంగీతానికి ఏడు స్వరాలు.. మనిషిలో ఏడు చక్రాలు.. పెళ్లిలో ఏడు అడుగులు.. ప్రపంచ వింతలు ఏడు.. ఏడో నెల (జూలై) ఏడో తేదీన మరో అద్భుతమే ధోనీ పుట్టిన రోజు’ అంటూ ట్వీట్ చేశాడు.