క్రీడాభూమి

కాశ్మీర్ సమస్యకు క్రికెట్‌తో ముడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్ : ఒక క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్‌ను లేదా మ్యాచ్‌ని వేదికగా చేసుకొని, రాజకీయాంశాలను వెలుగులోకి తీసుకురావలన్న ప్రయత్నాలు ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. కాశ్మీర్ సమస్యకు క్రికెట్‌తో ముడిపెట్టడం ఎంత వరకూ సబబని పలువురు నిలదీస్తుండగా, భారత్ వ్యతిరేక బ్యానర్లు ప్రత్యక్షం కావడంపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ సంఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) లేఖ రాసింది. టీమిండియా ఆటగాళ్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం శనివారం నాటి తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, భారత్ తలపడినప్పుడు చోటు చేసుకున్న సంఘటనలను క్రికెట్ అభిమానులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. మ్యాచ్ ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే, ‘జస్టీస్ ఫర్ కాశ్మీర్’ (కాశ్మీర్‌కు న్యాయం కావాలి) అన్న బ్యానర్‌తో ఓ విమానం స్టేడియంపై చక్కర్లు కొట్టింది. ఓ అరగంట తర్వాత మరో విమానం, మరో కొత్త బ్యానర్‌తో దర్శనమిచ్చింది. ‘ఇండియా.. స్టాప్ జెనోసైడ్, ఫ్రీ కాశ్మీర్’ (్భరత్.. మారణ హోమాన్ని నిలిపేయ్, కాశ్మీర్‌కు స్వేచ్ఛనివ్వు) అని రాసి ఉన్న బ్యానర్‌తో విమానం స్టేడియంలోని ఫ్లడ్‌లైడ్లకు అత్యంత సమీపంలో కనిపించడంతో ప్రేక్షకులతోపాటు, ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో వీక్షిస్తున్న ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని అభిమానులు ఉలిక్కిపడ్డారు. భారత్‌కు వ్యతిరేకంగా ఇలాంటి బ్యానర్లు ఏమిటనే చర్చ మొదలైంది. లంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ ఛేదిస్తున్న సమయంలో మరో బ్యానర్ కనిపించింది. ‘హెల్ప్ ఎండ్ మాబ్ లించింగ్’ (మూక హత్యల నిరోధానికి సాయం చేయండి) అనే బ్యానర్‌తో విమానం స్టేడియం పైన తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కాగా, ఈ సంఘటనలపై ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. భద్రతా వైఫల్యాలు, ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. సెమీ ఫైనల్స్ సమయంలోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతమైతే, పరిస్థితి మరో విధంగా ఉంటుందని పరోక్షంగా హెచ్చరించింది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, ఇందులో రాజీ ఉండబోదని బీసీసీఐ తేల్చిచెప్పింది. కాగా, ఈ సంఘటనలు అత్యంత దురదృష్టకరమైనవని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ కప్ టోర్నమెంట్ సమయంలో రాజకీయ అంశాలకు తావులేదని స్పష్టం చేసింది.
రాజకీయపరమైన అంశాలకు వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ‘జస్టీస్ ఫర్ బలూచిస్తాన్’ (బలూచిస్తాన్‌కు న్యాయం జరగాలి) అని బ్యానర్‌తో ఓ విమానం దర్శనమిచ్చింది. ఆ విమానం తర్వాత బ్రాడ్‌ఫోర్డ్ విమానాశ్రయంలో దిగింది. భారత్, శ్రీలంక మ్యాచ్ జరుగుతున్నప్పుడు మూడు పర్యాయాలు, వేర్వేరు బ్యానర్లతో విమానాలు చక్కర్లు కొట్టడం స్థానిక అధికారుల వైఫల్యాలకు నిదర్శనంగా పేర్కోవాలి. తమ ఎయిర్ స్పేస్‌పై వారికి ఎలాంటి పట్టు లేదని స్పష్టమవుతున్నది. ఇలావుంటే, రెండు సెమీ ఫైనల్స్ జరిగే మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జిబాస్టర్ స్టేడియం ఉన్న ప్రాంతాలను ‘నో ఫ్లై జోన్’గా అధికారులు ప్రకటించినట్టు సమాచారం. ఇలాంటి ఆదేశాలు విడుదలై తర్వాత, ఆ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించే విమానాలను కూల్చేసే అధికారం భద్రతా సిబ్బందికి ఉంటుంది.