క్రీడాభూమి

బార్టీకి రిస్కే షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 8: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆష్లే బార్టీ అనూహ్యంగా ఓటమిపాలైంది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి అలీసన్ రిస్కే 3-6, 6-2, 6-3 తేడాతో విజయం సాధించి, ఆమెకు షాకిచ్చింది. మొదటి సెట్ ను గెల్చుకున్న బార్టీ ఆతర్వాత అదే స్థాయిలో ఆడలేకపోయింది. ఫలితంగా వరుసగా రెండు సెట్లతోపాటు, మ్యాచ్‌ని కూడా చేజార్చుకుంది. సంచలన విజయంతో రిస్కే క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. మరో ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ ఎలినా స్విటోలినా 6-4, 6-2 ఆధిక్యంతో పెట్రా మార్టిక్‌పై గెలుపొందింది. జాంగ్ షుయ్ 6-4, 1-6, 6-2 తేడాతో డయానా యస్ట్రేమ్‌స్కాను ఓడించింది. బార్బరా స్ట్రయికోవా 4-6, 7-5, 6-2 స్కోరుతో విజయాన్ని నమోదు చేసింది.

చిత్రం...సంచలన విజయం సాధించిన అలీసన్ రిస్కే