క్రీడాభూమి

నా బౌలింగ్ ప్రాణాంతకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 8: ‘నేనూ బౌలింగ్ చేస్తా.. నా బౌలింగ్ ప్రాణాంతకం.. భీకరంగా బంతులు వేస్తా..’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగే వరల్డ్ కప్ క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమవుతున్న కోహ్లీ సోమవారం ఇక్కడ జరిగిన వి లేఖరుల సమావేశంలో మాట్లాడు తూ భారత బౌలింగ్ గురించి అడిగి న ఓ ప్రశ్నకు సరదాగా స్పందించాడు. బౌలింగ్ విభాగంలో తమ జట్టు బలంగా ఉందని అంటూ, అవసరమైతే తాను కూడా బౌలింగ్ చేయగలనని జోక్ చేశాడు. అంతేగాక, తన బౌలింగ్ ప్రాణాంతకమైనదని, అంతటి భీకరంగా బంతులు వేస్తానని కోహ్లీ అన్నప్పుడు సమావేశంలో నవ్వులు పూశాయి. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, కివీస్‌తో మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఒత్తిడిని తట్టుకునే శక్తి తమకు ఉందని వ్యాఖ్యానించాడు.
11 సంవత్సరాల తర్వాత..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 2008 అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్ జరిగింది. ఆ టోర్నీలో భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించాడు. టైటిల్‌ను సాధించిపెట్టాడు. కాగా, సెమీస్‌లో ఆడిన ఇరు జట్లలోని కొంత మంది ఆటగాళ్లు ఇప్పుడు వరల్డ్ కప్‌లోనూ కనబడడం విశేషం. భారత కెప్టెన్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఆ మ్యాచ్ ఆడారు. అంతేగాక, రవీంద్ర జడేజా, టిమ్ సౌథీ కూడా అండర్-19 వరల్డ్ కప్‌లో పాల్గొన్నారు. అప్పటి జట్టులోని కొంత మంది సుమారు 11 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో తలపడడాన్ని ప్రస్తావించగా, ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదని కోహ్లీ అన్నాడు. కేవలం భారత్, న్యూజిలాండ్‌లోనేగాక, ఇప్పుడు వరల్డ్ కప్‌లో ఆడిన దాదాపు అన్ని జట్లలోనూ అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడిన వారు ఉన్నారని చెప్పాడు. కివీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, అన్ని రకాలుగా సిద్ధమైతేగానీ సమర్థంగా ఎదుర్కోలేమని అన్నాడు. కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్ వంటి సమర్థులు జట్టులో ఉన్నారని తెలిపాడు.

బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్!
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటే, కివీస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌ని బ్యాటింగ్, బౌలింగ్ మధ్య జరిగే ఆధిపత్య పోరుగా పేర్కోవచ్చు. భారత టాపార్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్, రోహిత్ శర్మ (647 పరుగులు), లోకేష్ రాహుల్ (360 పరుగులు), విరాట్ కోహ్లీ (442 పరుగులు) మంచి ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా కివీస్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్ (17 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (15 వికెట్లు), మాట్ హెన్రీ (10 వికెట్లు) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల సెమీ ఫైనల్ పోరు ఆసక్తిని రేపుతున్నది.