క్రీడాభూమి

రిస్కేను ఢీకొననున్న సెరెనా విలియమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: వింబుల్డన్ సింగిల్స్‌లో 24 టైటిళ్లు గెలిచిన మార్గరెట్ కోర్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ రికార్డును సమం చేసే అవకాశం బహుశా సెరెనా విలియమ్స్‌కు ఎప్పుడూ రాకపోవచ్చు. ఏడుసార్లు వింబుల్డన్ సింగిల్స్ టైటిళ్లు సాధించిన సెరెనా విలియమ్స్ తొలి వారంతో పోలిస్తే ఇప్పుడు కాస్త బాగా ఆడుతోంది. అయితే ఆమె మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్‌లో తన ప్రత్యర్థి అలిసన్ రిస్కేను తేలిగ్గా తీసుకోవడం లేదు. 29 ఏళ్ల అమెరికన్ అయిన రిస్కే ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ఆశే్లగ్ బార్టిని ఓడించింది. అందువల్ల రిస్కేను తేలిగ్గా తీసుకోకపోవడం సెరెనా తెలివయిన ఆలోచనే అని చెప్పకతప్పదు. రిస్కే తన దేశానికే చెందిన సెరెనాను ఢీకొనడానికి సిద్ధమవుతోంది. రిస్కే తనకన్నా బాగా ఆడుతోందనే విషయం విలియమ్స్‌కు తెలుసు. వాళ్లిద్దరు కలిసి డబుల్స్‌లో ఆడారు. ‘ఆమె (రిస్కే) కోర్టులో ఒక పోరాటయోధురాలు’ అని విలియమ్స్ అన్నారు. ‘ఆమె నిజంగా అద్భుతంగా ఆడుతోంది. ముఖ్యంగా గడ్డి మీద. ఆమె బాల్‌ను అటాక్ చేస్తోంది. దేనినీ ఆమె వదులుకోవడం లేదు’ అని విలియమ్స్ అన్నారు. మోకాలి సమస్యతో బాధపడుతున్న విలియమ్స్ తిరిగి తన ఆటతీరులో మెరుగుదలపై కొంత సందేహాస్పదంగానే మాట్లాడారు. ‘తుప్పు కచ్చితంగా తీవ్రతను, సమర్థతను దెబ్బతీస్తున్నది’ అని విలియమ్స్ అన్నారు.
చిత్రాలు.. అలిసన్ రిస్కే *సెరెనా విలియమ్స్