క్రీడాభూమి

మూడు దేశాలదే ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 9: క్రికెట్ ప్రపంచంలోని సంపన్న దేశాలయిన ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియాల ఆధిపత్యమే అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతోందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. అవును, ఈ మూడు దేశాలు ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి. క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు నిధులు సమకూర్చడంలో ఈ టోర్నమెంట్‌యే కీలకం. ఈ టోర్నమెంట్‌లో ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయమే 500 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. క్రికెట్ ద్వారా వచ్చే అధిక సొమ్ము క్రికెట్ సంపన్న దేశాలకే వెళ్లిపోతోంది. 2019, 2023 ప్రపంచ కప్‌లు కీలక ఈవెంట్లుగా ఉన్న 2016-23 బ్రాడ్‌కాస్టింగ్ సైకిల్‌లో కొన్ని 93 అసోసియేట్ లేదా జూనియర్ క్రికెట్ దేశాలు ఐసీసీ నుంచి 175 మిలియన్ డాలర్లు తీసుకుంటుండగా, ఒక్క భారతదేశమే 320 మిలియన్ డాలర్లు అందుకోనుంది. దీనికి తోడు, మూడు క్రికెట్ పెద్ద దేశాలు తమ తమ దేశాల్లో స్థానికంగా కుదుర్చుకునే ప్రసార ఒప్పందాల వల్ల భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. మరోవైపు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి పేద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలలోని క్రికెట్ జట్లు పోటీ పడటానికి ప్రయాస పడాల్సి వస్తోంది.
ఈ దేశాల్లోని క్రికెట్ ఆటగాళ్లు లాభదాయకమయిన మరో కెరీర్‌ను ఎంచుకుంటూ అంతర్జాతీయ క్రికెట్‌ను వీడటం నిత్యం జరుగుతూనే ఉంది. ట్వంటీ20 ఫ్రాంచైజ్ పోటీలలోకి వెళ్లిపోవడం ఇందులో ఒకటి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతం అయ్యాక ఇలాంటి ఫ్రాంచైజీ పోటీలు పెరుగుతున్నాయి. అనిశ్చయమయిన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను వదలివేసి, ఇంగ్లీష్ కౌంటీల్లోని యార్క్‌షైర్‌లో చేరుతానని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డౌనే ఓలివర్ ప్రకటించిన తరువాత, వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అంతర్జాతీయ క్రికెట్‌లో కనీస వేతనాలను అమలు చేయాలని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఐసీసీని కోరడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇంగ్లాండ్, వేల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టిన నాలుగో దేశం న్యూజిలాండ్ మాత్రం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వేగంగా కదిలి, తన టాప్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడటానికి వీలు కల్పిస్తోంది. చిన్న దేశమయినా మంచి ప్రతిభను గుర్తించి జట్టును నిర్మించుకోవడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో గట్టి పోటీని ఇస్తోంది.