క్రీడాభూమి

వందో విజయంపై ఫెదరర్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: రోజర్ ఫెదరర్ బుధవారం వింబుల్డన్‌లో వందో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాడు. ఈ వందో విజయం సాధిస్తే అతను రాఫెల్ నాదల్‌తో బ్లాక్‌బస్టర్ సెమీ-ఫైనల్ ఆడతాడు. అదే జరిగితే అత్యంత విజయవంతమయిన ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇది 40వ మ్యాచ్ అవుతుంది. అంతేకాదు, 2008లో ఈ టోర్నమెంట్‌లో నాదల్ విజయం సాధించిన తరువాత ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌లో తలపడుతుండటం ఇదే మొదటిసారి. 2008 నాటి ఫైనల్ మ్యాచ్ ఈ టోర్నమెంట్‌లోనే అద్భుతమయినదిగా విస్తృత ప్రాచుర్యం పొందింది. అయితే, ఈ ఇద్దరు రాటుదేలిన ఆటగాళ్లు ఆ దశకు చేరుకోవాలంటే, క్వార్టర్ ఫైనల్ స్థాయిని దాటాల్సి ఉంది. ఎనిమిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన ఫెదరర్ క్వార్టర్ ఫైనల్‌లో కెయి నిషికొరిని ఓడించాల్సి ఉంది. రెండుసార్లు విజేతగా నిలిచిన నాదల్ బిగ్ హిట్టింగ్ సామ్ క్వెర్రీని ఓడించాల్సి ఉంది. సెమీ ఫైనల్‌లో ఎవరు నెగ్గితే వారు ఫైనల్‌లో టైటిల్ కోసం డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు విజేతగా నిలిచిన నొవాక్ జొకోవిక్‌తో తలపడతారు. 1991లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడిన జిమీ కోనర్స్ తరువాత 37 ఏళ్ల ఫెదరరే క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న అందరికన్నా పెద్దవాడు. ఫెదరర్ ఇటలీకి చెందిన మాటియో బెర్రెట్రినిని ఓడించి 17వసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ‘నిషికొరి మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి. అది మేము మెరుగుగా ఆడటానికి దోహదపడుతుంది. నేను నా అనుభవంతో చెబుతున్నాను. అది మంచి ఆట’ అని రెండో సీడ్ ఆటగాడు ఫెదరర్ అన్నాడు.