క్రీడాభూమి

అడ్డుకున్న వరుణుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు మంగళవారం మాంచెస్టర్ వేదికగా మొదటి సెమీఫైనల్‌లో తలపడ్డాయి. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనగా రెండు సార్లు వర్షం అడ్డుపడడంతో అంపైర్లు మ్యాచ్‌ని బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు ఆదిలోనే తడబడింది. భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడ్డారు. మొదటి రెండు ఓవర్లు పరుగులేమీ రాకపోగా, మూడో ఓవర్‌లో ఒక్క పరుగుతో కివీస్ స్కోరు బోర్డు మొదలైం ది. ఆ తర్వాతి ఓవర్ వేసిన బుమ్రా రెండో బంతికే ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (1)ని పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ గుప్టిల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపో యాడు. మరోవైపు టీమిండియా బౌలర్ల ధాటికి మొదటి 5 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన న్యూజిలాండ్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోయ 27 పరుగులు చేసింది. దీంతో మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్‌తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకు న్నాడు. అయితే కొద్దిసేపటికే నికోల్స్ (28)ని రవీంద్ర జడేజా బౌల్డ్ చేయడంతో వీరిద్దరి జోడికి తెరపడింది. వీరిద్దరూ కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమో దు చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్‌తో కలిసి విలియమ్సన్ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డు ను పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విలియ మ్సన్ (67) తన కేరీర్‌లో 39, ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీని సాధించి, కొద్దిసేపటికే చాహల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. టేలర్, విలియమ్సన్ 65 పరగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ నీషమ్ (12) ఇలా వచ్చి అలా వెళ్లాడు. మరోవైపు రాస్ టేలర్ అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తర్వాత కొలిన్ డీ గ్రాండ్‌హోం (16) ఎక్కువసేపు క్రీజులో నిలదొ క్కుకో లేదు. భువనేశ్వర్ వేసిన అద్భుత బంతికి నీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు.
ధోనీ 350
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరో ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా ధోనీ 350 వనే్డలు ఆడిన ఆటగాడిగా గుర్తింపును అందుకున్నాడు. భారత్ తరఫున మాజీ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (463) వనే్డలు ఆడగా, ఆ తర్వాతి స్థానంలో ధోనీ నిలిచాడు. ఓవరాల్‌గా 350 వనే్డలాడిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ 10వ క్రికెటర్‌గా ఈ ఘనతను అందుకున్నాడు. అయతే వికెట్ వికెట్ కీపర్‌గా అత్యధిక వనే్డలాడిన ఆటగాళ్లలో మాత్రం ధోనీ మొదటి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కుమార సంగాక్కర 360 వనే్డలాడినా అందులో 40 మ్యాచుల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు.
అడ్డుకున్న వరుణుడు..
మరో 4 ఓవర్లు వేస్తే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగు స్తుందనగా వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను బుధ వారానికి వాయిదా వేశారు. అప్పటికీ 44.4 ఓవర్లలో కివీస్ 5 కీలక వికెట్లు కోల్పోయ 211 పరగులు చేసిం ది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.
చిత్రాలు.. పిచ్‌.. *పరిశీలిస్తున్న అంపైర్లు (ఇన్‌సెట్‌లో)