క్రీడాభూమి

ఇంగ్లాండ్ గెలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూలై 10: హాట్ ఫెవరిట్‌గా మెగా టోర్నీలో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అష్టకష్టాలు పడి సెమీస్‌కు చేరింది. గురువారం ఆస్ట్రేలియాను ఢీకొననుంది. లీగ్ మ్యాచుల్లో రెండు ఓటములతో బలంగా ఉన్న కంగారులను ఇంగ్లీష్ జట్టు నిలువరించి, ఫైనల్‌లోకి అడుగు పెడుతుందా? లేదా? అనేది నేడు తేలనుంది. క్రికెట్‌కు పుట్టినిల్లయన ఇంగ్లాండ్ ఇప్పటివరకు ప్రపంచ కప్‌ను సాధించలేక పోయంది. 1979లో ఫైనల్ వరకు చేరినా వెస్టిం డీస్ చేతిలో 92 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకు ముందు 1975, 1983 టోర్నీల్లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నా ఫైనల్‌కు చేరుకోలేకపో యంది. మరోసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. అయతే తన చిరకాల ప్రత్యర్థి, బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించాలి. లీగ్ మ్యాచ్‌లోనే కంగారూల చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లీష్ ఈసారి ఫైనల్‌కి చేరితే టోర్నీని సాధించినట్లేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎలా ఆడతారో..?
లీగ్ మ్యాచుల్లో మొదట్లో నెంబర్ వన్ జట్టుగా సత్తా చాటిన ఇంగ్లాండ్, ఆ తర్వాత పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని ముటగట్టుకుంది. నేడు జరగనున్న కీలక మ్యాచ్‌లో జానీ బెయర్ స్టో, జేమ్స్ విన్స్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ రాణిస్తే ఆతిథ్య జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో రాణిస్తున్న జొఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్ స, మార్క్ వుడ్ వంటి పేసర్లతో పాటు మొయన్ అలీ, అదిల్ రషీద్ స్పిన్ ఇంగ్లీష్ జట్టుకు కలిసొచ్చే అంశం.
వార్నర్, ఫించ్ భాగస్వామ్యమే కీలకం..
ఆస్ట్రేలియా జట్టు ఈసారీ టోర్నీపై కనే్నసింది. ప్రపంచకప్ ముందు వరకు ఏమాత్రం అంచనాలేని కంగారూలు టోర్నీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్లను మట్టికరిపించారు. లీగ్ మ్యాచ్‌లో టీమిండియాతో ఓడినా, ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి.
అయతే చివర్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఓ రకంగా ఆస్ట్రేలియాను ఇబ్బందిపెట్టే అంశమే. అయతే కంగారూల ప్రధాన బలం ఆ జట్టు ఓపెనర్లే. డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్‌లు ఈ ప్రపంచ కప్‌లో 500కు పైగా పరుగులు సాధించి, మంచి ఫాంలో ఉన్నారు. అయతే మిడిలార్డర్ సమస్య కొంత వేధిస్తున్నా, ఉస్మాన్ ఖాజా, మార్కస్ స్టొయనిస్, అలెక్స్ క్యారీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు రాణిస్తే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి ఫైనల్‌కి వె ళ్లడం ఖాయమే.
సచిన్ రికార్డు భద్రమేనా?
2003 ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డును ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అధిగమించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లోనే రోహిత్ శర్మ ఈ రికార్డు అధిగమిస్తాడునుకున్నా ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. నేడు జరిగే మ్యాచ్‌లో వార్నర్ మరో 35 పరుగులు చేస్తే సరికొత్త రికార్డును సృష్టించే అవకాశముంది.
స్టార్ క బ 26
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ముంగిట మరో రికార్డు ఎదురు చూస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ తీసి నా స్టార్క్ సరికొత్త ఘనత సాధించనున్నాడు. ఒక మెగా టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియాకే చెందిన మెక్‌గ్రాత్ నిలిచాడు. 2007 ప్రపంచకప్‌లో ఈ అరుదైన ఘనతను మెక్‌గ్రాత్ సొంతం చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచు ల్లోనే 26 వికెట్లు తీసి మెక్‌గ్రాత్ సమానంగా ఉన్న స్టార్క్ సరికొత్త రికార్డుకు వికెట్ దూరంలో నిలిచాడు.

చిత్రాలు.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్
*ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు