క్రీడాభూమి

రేసులో ఠాకూర్ ఒక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఠాకూర్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో, ఆదివారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అతను పోటీ లేకుండా ఎన్నిక కావడం ఖాయమైంది. బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ రికార్డు సృష్టించనున్నాడు. జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో బోర్డు అధ్యక్ష పదవికి ఎన్నికలు అనివార్యంకాగా, శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా పోటీ చేయడానికి వీలుగా అతను బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. కేవలం ఏడు నెలలు పదవిలో ఉన్న మనోహర్ వైదొలగి, ఐసిసి చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. బిసిసిఐ అధ్యక్ష పదవికి మరోసారి ఎన్నిక అవసరమైంది. ప్రస్తుతం బోర్డుకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిజెపి పార్లమెంటు సభ్యుడు ఠాకూర్ ఈస్ట్‌జోన్‌లోని క్రికెట్ సంఘాల మద్దతుతో అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాడు. బరిలో అతను ఒక్కడే ఉండడంతో ఆదివారం నాటి ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడిగా ఠాకూర్ ఎన్నిక లాంఛనం కానుంది.