క్రీడాభూమి

ఫైనల్‌కు కివీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్ : అవును.. ఎవరూ ఊహించనిదే నిజమైంది! మెగా టోర్నీలో భారత్ కథ ముగిసింది. హాట్ ఫెవరిట్‌గా బరిలోకి దిగిన విరాట్ సేన బుధవారం జరిగిన కీలక సెమీ ఫైనల్‌లో 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోయంది. ఓవైపు వర్షం.. మరోవైపు టాప్, మిడిలార్డర్ వైఫల్యంతో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక పరాజ యాన్ని చవిచూసింది.
అంతకుముందు 215 పరుగులతో రిజర్వ్ డే నాడు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 239 పరుగులు చేసింది. భారత బౌ లర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్‌కు తలో వికెట్ దక్కింది.
తడబడ్డ ‘త్రీమూర్తులు’..
239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియాకు ప్రపంచకప్‌లో వరుస విజయాలను అందించిన త్రీమూర్తులు (టాప్ త్రీ) రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), విరాట్ కోహ్లీ (1) వరుసగా పెవిలియన్‌కు చేరడంతో 5 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయ భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో 19 పరుగులకే దినేష్ కార్తీక్ (6) కూడా అవుట్ అయ్యాడు. దీంతో యువ క్రికెటర్ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా జట్టు భారాన్ని తమపై వేసుకున్నారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకొని పరుగులు రాబట్ట డంలో సఫలమ్యారు. అయతే రిషభ్ పంత్ (32) శాంత్నర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోనీతో కలిసి పాండ్య నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ దశలో పాండ్యా (32) కూడా శాంత్నర్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. అప్పటికీ భారత్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ కేవలం 92 పరుగులు మాత్రమే చేసింది.
ఆశలు పెంచిన ధోనీ, జడేజా జోడి..
ఆరు వికెట్లు కోల్పోయ దాదాపు పరాజయం ఖాయమైన భారత జట్టును రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్ ధోనీ ముందుకు నడిపించారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లకు అడ్డుగా నిలిచి జట్టును విజయ తీరాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇన్నింగ్స్ దగ్గర పడుతున్న కొద్దీ చేయాల్సిన పరుగులకు, బంతులకు భారీ వ్యత్యాసం ఉండడంతో ధాటిగా ఆడే క్రమంలో బౌల్ట్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పట్టిన అద్భుత క్యాచ్‌కు జడేజా (77) వెనుదిరిగాడు.
ఆ తర్వాత వరుసగా..
రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ (50) ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయతే లేని పరుగుకు యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్ లో చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా, జేమ్స్ నీషమ్ వేసిన చివరి ఓవర్‌లో మూడో బంతికి యుజువేంద్ర చాహల్ (5) పెవియన్‌కు చేరడంతో భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా (0, నాటౌట్) క్రీజులో ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ భారత్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో సారి ఫైనల్‌కి చేరుకుంది.
కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3 వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంత్నర్ రెండేసి, లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ ఒక్కో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాట్ హెన్రీకి దక్కింది.
వర్షమూ కారణమే..
భారత్ వంటి అగ్రశ్రేణి జట్టు సెమీస్‌లో ఓడిపోవడానికి వర్షం కూడా ఓ కారణంగా నిలిచింది. అసలు మంగళవారం జరగాల్సిన మ్యాచ్ రెండు సార్లు వర్షం రావడంతో అంపైర్లు నిలిపివేశారు. తిరిగి రిజర్ వ డే (బుధవారం) రోజు ప్రారంభమైంది. అయతే అప్పటికీ పిచ్ తడిగా ఉండి స్లోగా మారడంతో పరుగు లు రాబట్టేందుకు భారత బ్యాట్స్‌మె న్లు ఇబ్బంది పడ్డారు.
ఒకవేళ డక్ వర్త్ లూయస్ పద్ధతి ప్రకారం మంగళవారం నాడే మ్యాచ్ జరిగి ఉంటే భారత్ ఫైనల్‌కి చేరేదని అభిమానులు పేర్కొంటున్నారు.
చిత్రాలు.. . ధోనీని ఔట్ చేసిన ఆనందంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు

*అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్ ధోనీ