క్రీడాభూమి

టాపార్డర్ రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 11: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓడడానికి ప్రధాన కారణమైన టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఓపెనర్లు లోకేష్ రాహుల్ ఒక పరుగు చేసి, మాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. రోహిత్ శర్మ కూడా ఒకే పరుగు చేసి, రాహుల్ తరహాలోనే పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఒక పరుగుకే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. వనే్డ క్రికెట్ చరిత్రలోనే మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఈ విధంగా ఒక పరుగు చేసి ఔట్ కావడం ఇదే మొదటిసారి. మ్యాచ్ పోతేపోయింది.. ఫైనల్లో చోటు దక్కకపోతే పోయింది.. కొత్త రికార్డు మాత్రం టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు దక్కింది.
* న్యూజిలాండ్‌ను ఓడించడానికి 240 పరుగులు సాధించాల్సి ఉండగా, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన టీమిండియా ఒకానొక దశలో 92 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (50), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (77) ఏడో వికెట్‌కు 116 పరుగులు జోడించి, అభిమానుల్లో ఆశలు రేపారు. కానీ, వీరి మాదిరిగానే మిగతా వారు బాధ్యతను భుజాలపైకి తీసుకోకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
* ఈసారి వరల్డ్ కప్‌లో ఇంత వరకూ పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు చేసిన జట్ల జాబితాలో టీమిండియా నంబర్ వన్ స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో, పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. అంతకు ముందు ఒక వికెట్‌కు 27 పరుగులు సాధించింది. బర్మింగ్‌హామ్‌లో గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 27 పరుగులు చేసినప్పటికీ, మూడు వికెట్లు కోల్పోయింది. ఇదే మైదానంలో, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 28 పరుగులు సాధించింది. మాంచెస్టర్‌లో భారత్‌పై వెస్టిండీస్ రెండు పరుగులకు 29 పరుగులు నమోదు చేసింది. అదే వేదికపై వెస్టిండీస్‌ను ఢీకొన్న న్యూజిలాండ్ రెండు వికెట్లకు 30 పరుగులు సాధించింది.
* వరల్డ్ కప్ మ్యాచ్‌లను టెస్టుల మాదిరి ఆడాడన్న విమర్శను ఎదుర్కొం టున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై ఉత్కం ఠ నెలకొంది. అతను త్వరలోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వెళతా డన్న వార్త ప్రచారవుతోంది. అయతే, అతనికి భారత క్రికెట్ నియంత్రణ బో ర్డు (బీసీసీఐ) మద్దతు లభించింది. మరికొంతకాలం కెరీర్‌ను కొనసాగించే సత్తా అతని ఆటతో స్పష్టమైందని బీసీసీఐ పాలనాధికారుల బృందం సభ్యు రాలు డయానా ఎడుల్జీ చేసిన వ్యాఖ్య ఈ వాదనకు బలాన్నిస్తున్నది.