క్రీడాభూమి

ముగిసిన ఫిజియో ఫర్హత్ కాంట్రాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)తో టీమిండియా ఫిజియోథెరపిస్టు పాట్రిక్ ఫర్హత్ ఒప్పందం ముగిసింది. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఆ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించినప్పుడే, ఫర్హత్ సేవలకు తెరపడింది. ఇంతకాలం తనకు మద్దతునిచ్చిన బీసీసఐకి అతను కృతజ్ఞతలు తెలిపాడు. కాంట్రాక్టు ఏ విధంగా ముగియాలని అనుకున్నానో అందుకు భిన్నంగా ముగిసిందని వాపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఫర్హత్ 2015 నుంచి భారత జట్టుకు ఫిజయోగా సేవలు అందిస్తున్నాడు. ఫిట్నెస్, కండిషనింగ్ కోచ్ శంకర్ బసుకు అన్ని విధాల సహకరించాడు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తో ఫర్హత్‌తోపాటు బసు కూడా వైదొలగుతున్నాడు. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టులోని ఇతర సభ్యులు సోషల్ మీడియా మాధ్యమంగా వీరిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. జట్టుకు వీరు అందించిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు.