క్రీడాభూమి

కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, మే 22: కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ రాయల్ చాలెంజ ర్స్ బెంగళూరును ప్లే ఆఫ్‌కు చేర్చింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన కీల క మ్యాచ్‌లో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన డేర్‌డెవిల్స్ 20 వర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 60 పరుగులతో రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఒక దశలో సమస్యల్లో పడింది. క్రిస్ గేల్ (1), ఎబి డివిలియర్స్ (6) త్వరత్వరగా అవుట్‌కాగా, లోకేష్ రాహుల్ 38 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. వాట్సన్ 14 పరుగులు చేసి వెనుదిరిగితే, కోహ్లీ 45 బంతుల్లో, ఆరు ఫోర్లతో 54, స్టువర్ట్ బిన్నీ 11 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచి బెంగళూరును ప్లే ఆఫ్‌కు చేర్చారు. బెంగళూ రు నాలుగు వికెట్లకు 139 పరుగులు చేసింది. కాగా, ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్‌కు చేరాయ. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తోపాటు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, డిఫెండింగ్ చాంపియన్ ముంబ య ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయంట్స్ నిష్క్రమించాయ.