క్రీడాభూమి

ఓ వైపు చదువు.. మరోవైపు టెన్నిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 11: వింబుల్డన్‌లో టీనేజ్ సంచలనం కొకొ గౌఫ్ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ వీనస్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించి అందరి దృష్టిని ఆకర్షిస్తే, ఆమె కంటే ఏడాది చిన్నదైన లిండా ఫ్రవిట్రోవా ఒకవైపు చదువుతూ, మరోవైపు టెన్నిస్‌లో రాణిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 15 ఏళ్ల గౌఫ్ రెండో రౌండ్‌లో మగ్దలీన రిబరికొవాను 6-3, 6-3 ఆధిక్యంతో చిత్తుచేసింది. మూడో రౌండ్‌లో పొలొనా హెర్కాగ్‌పై 3-7, 7-6, 7-5 స్కోరుతో విజయం సాధించింది. అయితే, నాలుగో రౌండ్‌లో ఆమె దూకుడుకు తెరపడింది. సిమోనా హాలెప్ చేతిలో 3-6, 3-6 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. కాగా, ఈ ఏడాది మే మాసంలో 14వ ఏట అడుగుపెట్టిన ఫ్రవిట్రోవా (చెక్ రిపబ్లిక్) వింబుల్డన్ జూనియర్స్ విభాగంలో పోటీకి దిగింది. తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ స్టార్ల ఆటో గ్రాఫ్స్ కోసం పరుగులు తీసిన ఆమె ఇప్పుడు ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో పోటీపడడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్న ఆమె తాను ఎప్పుడూ పరీక్షలకు గైర్హాజరు కాలేదని స్పష్టం చేస్తున్నది. చదవు, టెన్నిస్ తనకు రెండు కళ్లని, రెండింటికీ ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంటున్నది. సహజంగా ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరూ చదువుకు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ఫ్రవిట్రోవా మాత్రం టెన్నిస్‌ను ఎంతగా ప్రేమిస్తున్నదో అదే స్థాయిలో చదువుకు విలువనిస్తున్నది. చదువుకుంటూ, టెన్నిస్ ఆడడం తనకు ఏమీ ఇబ్బందిగా లేదని ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేసింది. ఫ్రవిట్రోవా 2005 మే మాసంలో జన్మించే నాటికే స్విట్లర్లాండ్ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ నాలుగు గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. అలాంటి ఆటగాడిని కలవడం, మాట్లాడడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఫ్రవిట్రోవా చెప్పింది. నిజానికి ఈ అవకాశం లభిస్తుందని తాను కలలో కూడా అనుకోలేదని తెలిపింది. అదే విధంగా తన దేశానికే చెందిన కిమ్ క్లిజ్‌స్టర్స్, విక్టోరియా అజరెన్కా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. టెన్నిస్, చదువు తన జీవితంలో భాగమని వ్యాఖ్యానించింది.