క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 22: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో పదో ర్యాంక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె డన్కా కొవినిక్‌ను 6-2, 4-6, 7-5 తేడాతో ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో అనస్తాసియా పవ్లిచెన్కొవా 6-2, 6-0 తేడాతో సారా సొరిబెస్‌పై టొర్మోపై గెలుపొందింది. సువెయ్ హీచ్ 7-6, 6-3 ఆధిక్యంతో లారా అరుబరెనాను ఓడించింది. విక్టోరియా గొలుబిక్ 6-2, 1-6, 6-2 తేడాతో అలిసన్ రిస్కేపై గెలిచింది.
ఇలావుంటే, పురుషుల విభాగంలో 19వ సీడ్ బెనోట్ పైరె 6-2, 4-6, 1-6, 6-4 స్కోరుతో క్వాలిఫయర్ రడూ అల్బోట్‌ను ఓడించాడు. 17వ సీడ్ నిక్ కిర్గియోస్ 7-6, 7-6, 6-4 స్కోరుతో మార్కో సెచి
నాతోపై
విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఆండ్రీ కుజ్నెత్సొవ్ 6-2, 6-2, 6-4 తేడాతో బెంజిమిన్ బెకర్‌ను ఓడించాడు. బొలెలీతో కెయ్ నిషికోరి మ్యాచ్ వర్షం కారణంగా ని లిచిపోయంది. అప్పటికి నిషికోరి 6-1, 7-5 తేడాతో రెండు సెట్లు గెలిచి, మూడో సెట్‌లో ప్రత్యర్థిపై 2-1 ఆధి క్యాన్ని సంపాదించాడు.